PNB Credit card: క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదా? ఎఫ్‌డీ చేస్తే పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్.. ఫీచర్లు ఇవే-pnb launches credit card against fixed deposit fd know features other benefits here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Pnb Launches Credit Card Against Fixed Deposit Fd) Know Features Other Benefits Here

PNB Credit card: క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదా? ఎఫ్‌డీ చేస్తే పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్.. ఫీచర్లు ఇవే

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 10:49 AM IST

రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ పొందేందుకు ఎలిజిబులిటీ లేని వారికి ప్రభుత్వ రంగ బ్యాంక్ పీఎన్‌బీ కొత్త స్కీమ్ తెచ్చింది.

8.1 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్
8.1 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్

ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హత ప్రమాణాలు అందుకోలేనప్పుడు ఈ విధానంలో క్రెడిట్ కార్డు పొందవచ్చు. ‘ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డుతో లాంజ్ యాక్సెస్, రివార్డు పాయింట్లు, క్యాష్ అడ్వాన్స్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు..’ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసే వారికి క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదటిది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 80 శాతం విలువ గల క్రెడిట్ లిమిట్‌ను పొందవచ్చు. రూపే గానీ, వీసా కార్డ్ గానీ పొందవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)పై క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ఇవే

1) ఎలాంటి డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయాల్సిన పనిలేదు.

2) బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేదు.

3) ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.

4) తక్షణం వర్చువల్ క్రెడిట్ జారీ చేస్తారు.

5) రూపే కార్డ్ అయితే సమగ్ర బీమా కవరేజీ ఉంటుంది

6) రూపే క్రెడిట్ కార్డు అయితే యూపీఐ లింకేజీ కూడా ఉంటుంది.

7) రివార్డ్ పాయింట్స్, ఆఫర్స్ లభిస్తాయి.

PNB latest FD rates: పీఎన్‌బీ తాజా ఎఫ్‌డీ రేట్లు

డిపాజిట్లను ఆకట్టుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

ఏడాది నుంచి మూడేళ్ల లోపు కాల వ్యవధితో కూడిన రూ. 2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి 6.75గా చేసింది. ఇంతకుముందు 6.25 శాతం ఉండేది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చాయని పీఎన్‌బీ తెలిపింది.

సీనియర్ సిటిజెన్లు రూ. 2కోట్ల లోపు డిపాజిట్లపై అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పొందుతారు. పీఎన్‌బీ ఉత్తమ్ స్కీమ్‌లో వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది. ఈ స్కీమ్‌లో మెచ్యూర్ కాకముందు ఉపసహరించుకోవడానికి వీలు కాదు. 

కాగా 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.1 శాతం వార్షిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది.

WhatsApp channel