PMV EaS-E Electric Car: పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ రేపే.. బడ్జెట్ రేంజ్‍లో మంచి ఫీచర్లతో..!-pmv electric compact electric vehicle set to launch tomorrow in indian market ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Pmv Electric Compact Electric Vehicle Set To Launch Tomorrow In Indian Market

PMV EaS-E Electric Car: పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ రేపే.. బడ్జెట్ రేంజ్‍లో మంచి ఫీచర్లతో..!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2022 03:48 PM IST

PMV Electric Vehicle: కాంపాక్ట్ సైజ్‍లో పీఎంవీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్ రేపు లాంచ్ కానుంది. పీఎంవీ ఈఏఎస్-ఈ పేరుతో ఇది రానుంది. మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

PMV EaS-E Electric Car: పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ రేపే
PMV EaS-E Electric Car: పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ రేపే (HT_Auto)

PMV EsS-E Electric Vehicle: ముంబైకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ.. తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు రెడీ అయింది. భారత మార్కెట్‍లోకి ఈ ఎలక్ట్రిక్ కారు రేపు (నవంబర్ 16) అడుగుపెట్టనుంది. రోజూ ప్రయాణించే వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. సైజ్‍లో ఈ వాహనం చిన్నగా ఉంటుంది. పీఎంవీ ఈఏఎస్-ఈ (PMV EaS-E) పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు వస్తోంది పీఎంవీ అంటే పర్సనల్ మొబిలిటీ వెహికల్ అని అర్థం. ఇది ఓ కొత్త సెగ్మెంట్ అని ఆ సంస్థ వెల్లడించింది. పీఎంవీ తొలి ఎలక్ట్రిక్ వాహనం రేపు లాంచ్ కానున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు వెల్లడైన విషయాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

PMV EaS-E Electric Car Price: ధర

వీఎంవీ తొలి ఎలక్ట్రిక్ కారు ధర రూ.4లక్షల నుంచి రూ.5లక్షల మధ్య ఉండనుంది. మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

PMV EaS-E Electric Car: కాంపాక్ట్ సైజ్‍లో..

రద్దీగా ఉండే నగరాల్లో సులువుగా తిరిగేందుకు కాంపాక్ట్ సైజ్‍తో ఈ పీఎంవీ ఎలక్ట్రిక్ వెహికల్ వస్తోంది. 1,600మిల్లీ మీటర్ల (mm) ఎత్తు, 2,915mm నిలువు, 1,157mm వెడల్పుతో ఈ కారు వస్తోంది. మొత్తంగా 550కేజీల బరువు ఉంటుంది.

PMV EaS-E Electric Car: రేంజ్ ఇదే

ఈ పీఎంవీ ఎలక్ట్రిక్ వాహనం మూడు వేరియంట్లలో రానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఎంపిక చేసుకునే వేరియంట్‍పై ఈ రేంజ్‍ ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.

PMV EaS-E Features: ఫీచర్లు

డిజిటల్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍ను పీఎంవీ ఈఏఎస్-ఈ ఎలక్ట్రిక్ కార్ కలిగి ఉంటుంది. యూఎస్‍బీ చార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండీషనింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజర్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ సహా మరిన్ని ఫీచర్లతో వస్తోంది.

WhatsApp channel