National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను ప్రదానం చేసిన ప్రధాని మోదీ; ఏమిటీ అవార్డ్స్?
National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలోని భారత్ మందిర్ వేదికగా వివిధ సృజనాత్మక విభాగాల్లో విజయం సాధించిన వారికి ప్రదానం చేశారు. స్టోరీ టెల్లింగ్, ఫిట్ నెస్, ఎడ్యుకేషన్, గేమింగ్ వంటి రంగాల్లోని సృజనాత్మక విజేతలను ఈ అవార్డ్ లకు ఎంపిక చేశారు.
National Creators Award: శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ 'నేషనల్ క్రియేటర్స్ అవార్డు'లను ప్రదానం చేశారు. స్టోరీ టెల్లింగ్, ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ, ఎడ్యుకేషన్, ఫిట్ నెస్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్.. వంటి వివిధ రంగాల్లోని సృజనాత్మకతను, ప్రతిభను గౌరవించడమే ఈ అవార్డులను ప్రకటించడం వెనుక ప్రధాన లక్ష్యం.
20 కేటగిరీలు..
ఉత్తమ కథకుడు, డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్, సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్, గ్రీన్ ఛాంపియన్, బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్, మోస్ట్ ఇంపాక్టివ్ అగ్రి క్రియేటర్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్, ఇంటర్నేషనల్ క్రియేటర్ సహా ఇరవై కేటగిరీలను ఈ అవార్డులో చేర్చారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతంలో శిక్షణ పొందిన నేపథ్య గాయని మైథిలి ఠాకూర్ ను 'కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్' విజేతగా ప్రకటించారు.
1.5 లక్షల నామినేషన్లు
ఈ అవార్డులకు 20 కేటగిరీల్లో 1,50,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఈ అవార్డు కేటగిరీల్లో డిజిటల్ క్రియేటర్లకు ఓటింగ్ దశలో సుమారు 1 మిలియన్ ఓట్లు పోలయ్యాయి. చివరకు, ముగ్గురు ఇంటర్నేషనల్ క్రియేటర్స్ సహా 23 మంది విజేతలను ఎంపిక చేశారు.
విజేతల జాబితా
నిశ్చాయ్ - గేమింగ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
అంకిత్ బయాన్ పురియా - ఉత్తమ హెల్త్ అండ్ ఫిట్ నెస్ క్రియేటర్
నమన్ దేశ్ ముఖ్ - ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
కబితా సింగ్ (కబితా కిచెన్) - ఫుడ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
ఆర్జే రౌనాక్ (బావా) - మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్-మేల్
శ్రద్ధా - మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్-ఫిమేల్
జాన్వీ సింగ్ - హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు
మల్హర్ కలంబే - స్వచ్ఛతా అవార్డు
అంబాసిడర్ గౌరవ్ చౌదరి - టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
కామియా జానీ - ఫేవరెట్ ట్రావెల్ క్రియేటర్
డ్రూ హిక్స్ - బెస్ట్ ఇంటర్నేషనల్ క్రియేటర్
మైథిలి ఠాకూర్ - కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్
జయ కిషోరి - సోషల్ ఛేంజ్ కు ఉత్తమ సృష్టికర్త
పంక్తి పాండే - ఫేవరెట్ గ్రీన్ ఛాంపియన్
రణ్ వీర్ అల్హాబాదియా (బీర్ బైక్స్) - డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్
పియూష్ పురోహిత్ - బెస్ట్ నానో క్రియేటర్
అరిదామన్ - బెస్ట్ మైక్రో క్రియేటర్
క్రియేటర్ అమన్ గుప్తా - సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్
లక్షయ్ దబాస్ - అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ విధాన సృష్టికర్త