LPG cylinder price : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మహిళలకు మోదీ కానుక!
మహిళా దినోత్సవం నేపథ్యంలో.. తీపి కబురును అందించారు ప్రధాని మోదీ. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
LPG cylinder price reduced : బ్రేకింగ్ న్యూస్! కోట్లాది మంది భారతీయులకు తీపి కబురును ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహిళా దినోత్సవం నేపథ్యంలో.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు మోదీ. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 కట్ చేస్తున్నట్టు తెలిపారు.
ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయం.. ముఖ్యంగా మహిళలకు చాలా లబ్ధిచేకూర్చుతుందని అభిప్రాయపడ్డారు మోదీ.
PM Modi LPG gas cylinder price : "ఈరోజు మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరం," అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.
"వంట గ్యాస్ మరింత చౌకగా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతివ్వాలన్న మా లక్ష్యం నెరవేరుతోంది. మహిళల అభ్యున్నతికి, సులభతర జీవితానికి మేము కట్టుబడి ఉన్నామని నిరూపిస్తోంది," అని మోదీ తెలిపారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు మోదీ ప్రకటించడం గమనార్హం.
LPG gas price in Hyderabad : మరోవైపు.. ఏప్రిల్ 1 నుంచి ఉజ్వల యోజన కింద రూ. 300 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పేద మహిళలకు ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది కేంద్రం.
రూ. 200గా ఉన్న 14.2 కేజీల సిలిండర్ సబ్సిడీని.. గతేడాది అక్టోబర్లో రూ. 300లకు (ఏడాదికి 12 ఫిల్లింగ్స్) పెంచింది కేంద్రం. అది.. మార్చ్ 31తో ముగియాల్సి ఉంది. కానీ దానిని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర ఎంత?
LPG gas price today Hyderabad : మోదీ ప్రకటనకు ముందు.. గత ఏడాది ఆగస్టు 30 నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. నేటి ప్రకటన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ. 855కు తగ్గనుందని గ్రహించాలి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర ఇంచుమించుగా ఇదే విధంగా ఉంది.
LPG gas cylinder price hike : అయితే.. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చ్ 1న పెంచాయి. రూ. 25 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఫలితంగా.. ఢిల్లీలో.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,795కు చేరింది. ముంబైలో నేటి నుంచి 19 కిలోల సిలిండర్ ధర రూ.1,749గా ఉంది. చెన్నై, కోల్కతాలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1,960, రూ.1,911కు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం