ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనేది దేశంలో భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. పీఎం కిసాన్ యోజన 19వ విడత నిధులు ఫిబ్రవరి 24న విడుదలయ్యాయి. ఇప్పుడు 20వ విడత నిధుల విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అవసరమైన లాంఛనాలను పూర్తి చేసి, తమ బెనిఫీషియరీ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలపై కేంద్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పలు మీడియా కథనాల ప్రకారం జూన్ 20న పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడొచ్చు. కాగా, ఈరోజు కాకపోతే, ఈ నెల చివరిలోగా నిధుల రైతుల అకౌంట్స్‌లో పడతాయని మరికొన్ని మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
ఈ పథకం కింద, తమ పేరు మీద సాగు చేయదగిన భూమి ఉన్న రైతు కుటుంబాలు ప్రయోజనం పొందడానికి అర్హులు. అయితే, నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి ఈ ప్రయోజనాలు వర్తించవు. డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులు కారు.
పీఎం-కిసాన్ పథకం కింద, భూమి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందుతుంది. ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. పీఎం కిసాన్ 19వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదలయ్యయి.
పీఎం కిసాన్ పథకం ప్రయోజనం సరైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి, ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈకేవైసీ కోసం మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
మొదటిది మొబైల్ యాప్‌లో ఓటీపీ ఆధారిత పద్ధతి, రెండవది స్టేట్ సేవా కేంద్రాలలో లభించే బయోమెట్రిక్ ఆధారిత పద్ధతి, మూడవది పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో లభించే ఫేస్ ఆధారిత పద్ధతి. ఇవి కాకుండా, లబ్ధిదారులు తమ భూమి రికార్డులను కూడా ధృవీకరించుకోవాలి. తమ బ్యాంక్ ఖాతాను తమ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి.
స్టెప్ 1- పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2- కుడివైపు కనిపిస్తున్న ఆప్షన్లో బెనిఫీషియరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి, గెట్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4- స్క్రీన్‌పై స్టేటస్ కనిపిస్తుంది.
సంబంధిత కథనం