Plaza Wires IPO: 23 రూపాయల జీఎంపీతో ప్లాజా వైర్స్ ఐపీఓ; ఈ రోజే లాస్ట్ డేట్
Plaza Wires IPO: ప్లాజా వైర్స్ ఐపీఓ కు బిడ్డింగ్ చేసే అవకాశం ఈ రోజుతో ముగుస్తుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు ఒక్కో షేరుపై రూ. 23 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.
Plaza Wires IPO: ప్లాజా వైర్స్ ఐపీఓ సెప్టెంబర్ 29న ఓపెన్ అయింది. అక్టోబర్ 5వ తేదీన ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 51 నుంచి రూ. 54 మధ్య ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 71.28 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది.
ప్రతికూల సమయంలో కూడా..
స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలతో ముగుస్తున్నప్పటకీ.. ఈ ప్లాజా వైర్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అక్టోబర్ 5వ తేదీన, ఈ కంపెనీ షేర్లు రూ. 23 జీఎంపీతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, షేర్లు అలాట్ అయినవారికి లిస్టింగ్ రోజు అమ్మేస్తే, లిస్టింగ్ ప్రైస్ కన్నా ఒక్కో షేరుపై రూ. 23 లాభం వచ్చే అవకాశం ఉంది.
81 రెట్లు..
ఈ ఐపీఓ బిడ్డింగ్ మూడో రోజు ఉదయం 12 గంటల సమయానికి 81.16 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. అందులో రిటైల్ పోర్షన్ 274.03 రెట్లు, ఎన్ఐఐ వాటా 191.15 రెట్లు, క్యూఐబీ వాటా 5.86 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. పలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ ట్యాగ్ ను ఇచ్చాయి. ఎలక్ట్రికల్ వైరింగ్ సెగ్మెంట్ కు భవిష్యత్తులో మంచి గ్రోత్ కు అవకాశమున్న నేపథ్యంలో ఈ ప్లాజా వైర్స్ ఐపీఓకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు.
ఐపీఓ వివరాలు..
ప్రారంభం: సెప్టెంబర్ 29.
ముగింపు : అక్టోబర్ 5
ప్రైస్ బ్యాండ్ : రూ. 51 నుంచి రూ. 54
లాట్ సైజ్ : 277 షేర్లు
ఒక్కో లాట్ కు ఇన్వెస్ట్ మెంట్: రూ. 14,958
అలాట్మెంట్ : అక్టోబర్ 10
రీఫండ్ : అక్టోబర్ 11
లిస్టింగ్ : అక్టోబర్ 13