Skoda Kylaq : భారతీయుల్లో ఈ ఎస్‌యూవీకి సూపర్ డిమాండ్- వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా?
Skoda Kylaq waiting period : స్కోడా కైలాక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ స్కోడా కైలాక్ ఫ్యామిలీ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా కొత్త కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలను ప్రారంభించింది. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ బ్రాండ్‌కి చెందిన అత్యంత సరసమైన వెహికిల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా, ఈ మోడల్‌పై కస్టమర్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ఎస్‌యూవీకి వచ్చిన డిమాండ్‌తో స్కోడా ఆటో బుకింగ్స్‌ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందంటే, ఈ కారు క్రేజ్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. 2024 డిసెంబర్లో ఆర్డర్ బుక్స్ తెరిచిన మొదటి 10 రోజుల్లోనే ఈ కైలాక్‌కి 10,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్ ఎస్యూవీ వెయిటింగ్ పీరియడ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్క తెలుసుకోండి..
స్కోడా కైలాక్ వెయిటింగ్ పీరియడ్..
వేరియంట్‌ను బట్టి స్కోడా కైలాక్ వేయిటింగ్ పీరియడ్ సగటున 6 నుంచి 8 వారాల మధ్యలో ఉందని డీలర్లు చెబుతున్నారు. మొదటి బ్యాచ్‌లో కైలాక్ కోసం 33,000 బుకింగ్‌లను అందుకున్న కంపెనీ ఈ ఏడాది మే నాటికి వాటిని డెలివరీ చేయాలని ప్లాన్ చేసింది. అంతేకాదు, బేస్ వేరియంట్ బుకింగ్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి.
మీరు స్కోడా కైలాక్‌ని బుక్ చేద్దాం అనుకుంటుంటే.. హైదరాబాద్‌లో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్కోడా కైలాక్ ధర..
ఈ స్కోడా కైలాక్ ఎస్యూవీ రూ .7.89 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ రూ .14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ స్కోడా కుషాక్‌తో భాగస్వామ్యం చేసినన ఎంక్యూబీ ఎ0 ఐఎన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్ ఆధారపడి ఉంటుంది. అయితే కైలాక్ పొడవైన, వెడల్పాటి బాడీతో ప్రయోజనం పొందుతుంది. మొత్తం పొడవును నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉంచడానికి వీల్‌బేస్ 85ఎంఎంకి కుదించడం జరిగింది. మొత్తం డ్రైవింగ్ డైనమిక్స్‌లో పెద్దగా రాజీపడకుండా ఫ్యామిలీ ఎస్యూవీ తన సామర్థ్యాన్ని పెంచుకునేలా కొత్త కైలాక్‌ను రూపొందించారు.
స్కోడా కైలాక్ స్పెసిఫికేషన్లు..
స్కోడా కైలాక్‌లో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113బీహెచ్పీ పవర్, 178ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, టీపీఎంఎస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్యూవీ ఇటీవల భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది.
సంబంధిత కథనం