Phones under 25000 : రూ. 25వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!-phones under 25000 grab the top brands from poco to samsung ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Phones Under 25000 : రూ. 25వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Phones under 25000 : రూ. 25వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
Published Nov 12, 2023 06:19 PM IST

Phones under 25000 : రూ. 25వేల బడ్జెట్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. మీకోసమే ఈ అమెజాన్​ లిస్ట్​!

రూ. 25వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!
రూ. 25వేల బడ్జెట్​లో ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..! (AFP)

Phones under 25000 : కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే రైట్​ టైమ్​! అమెజాన్​లో రూ. 25వేల బడ్జెట్​లోపు లభిస్తున్న ది బెస్ట్​ గ్యాడ్జెట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

రూ. 25వేల బడ్జెట్​లో బెస్ట్​ ఫోన్స్​..!

పోకో ఎక్స్​5 ప్రో:- ఇందులో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 108ఎంపీ తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. అమెజాన్​లో దీని వాస్తవ ధర రూ. 28,999. కానీ డిస్కౌంట్​లో ఈ మోడల్​ రూ. 20,999కే లభిస్తోంది.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం34:- ఇందులో 6.5 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీతో కూడిన రేర్​ కెమెరా వస్తోంది. ఎక్సినోస్​ 1280 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. అమెజాన్​లో దీని వాస్తవ ధర రూ. 25,999. కానీ ఆఫర్​లో ఇది రూ. 18,548కే లభిస్తోంది.

Best smartphones under 25000 : రెడ్​మీ నోట్​ 12 5జీ:- ఇందులో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 1 ప్రాసెసర్​ దీని సొంతం. 48ఎంపీతో కూడిన రేర్​ కెమెరా సెటప్​ వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 21,999. కానీ అమెజాన్​ సేల్​లో రూ. 16,999కే ఈ స్మార్ట్​ఫోన్​ని దక్కించుకోవచ్చు.s

మోటో జీ84:- మోటోరోలా జీ84లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంటుంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఉంటుంది. 6.5ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ పీఓఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. దీని ధర రూ. 22,950గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం