దీపావళి నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే, హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ 'ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్'ని ఫోన్‌పే లాంచ్ చేసింది. ఇందులో రూ. 9 కడితే, రూ. 25వేల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ వాలిడీటీ 10 రోజులు ఉంటుంది. దీపావళికి ముందు, అక్టోబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా ఈ బీమా అందుబాటులోకి వస్తుంది. జీఎస్టీతో కలుపుకుని రూ. 9కే ఈ ఇన్సూరెన్స్ లభిస్తోంది.
బాణాసంచా సంబంధిత ప్రమాదాలను ఇది కవర్ చేస్తుంది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, హాస్పిటల్- వైద్యం ఖర్చుల కోసం యూజర్స్ రూ. 25వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క నిమిషంలోనే పాలసీని కొనుగోలు చేసే విధంగా దీన్ని ఫోన్‌పే రూపొందించింది.
ఈ ఫోన్‌పే దీపావళి ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌లో ఒక ఫీచర్ హైలైట్! మీరు బీమా తీసుకుంటే, మీతో పాటు మీ కుటుంబంలోని ముగ్గురికి (భార్య, ఇద్దరు పిల్లలు) ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఫలితంగా మీరు దీపావళిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ఉంటుందని యూపీఐ పేమెంట్స్ లెజెండ్ చెబుతోంది.
దీపావళి సీజన్ చివరి వరకు ఈ ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన దగ్గర నుంచి కవరేజ్ ప్రారంభమవుతుంది.
స్టెప్ 1:- ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయండి. ఇన్సూరెన్స్ సెక్షన్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- 'ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్' ఆప్షన్ మీ క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ప్లాన్ డీటైల్స్ని చదవండి. రూ. 9 ప్రీమియం, రూ. 25వేల కవరేజ్ వంటి వివరాలను తెలుసుకోండి.
స్టెప్ 4:- పాలసీదారుల వివరాలను ఫిల్ చేయండి. పేమెంట్ చేయండి. అంతే!
ఈ ప్లాన్‌తో చౌకైన ధరకే కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ని ఇవ్వాలని ఫోన్‌పై చూస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము! ప్రతియేటా బాణాసంచా సంబంధిత ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. అందుకే బీమాలు తీసుకోవడం మంచి విషయం అని చాలా మంది భావిస్తున్నారు. ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్న చాలా మంది.. రూ. 9 చెల్లిస్తున్నారు.
“పండగ సమయంలో కొత్త బీమాని తీసుకొస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు నిశ్చితంగా మీ కుటుంబంతో వేడుకలు చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ మీకు మంచి కవరేజ్ ఇస్తుంది,” అని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్ సీఈఓ విశాల్ గుప్తా చెప్పారు.
సంబంధిత కథనం