Personal loans vs credit cards which is best : ఆర్థిక అవసరాల కోసం కొందరు పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇంకొందరు క్రెడిట్ కార్డ్ వాడుకుంటారు. అయితే.. ఏ పరిస్థితుల్లో ఏది ఎంచుకోవాలి? దేని వల్ల మనకి అధిక ప్రయోజనం చేకూరుతుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
క్రెడిట్ కార్డులో క్రెడిట్ లిమిట్ ఉంటుంది. మినిమమ్ పేమెంట్ చేస్తున్నంత కాలం.. ఆ లిమిట్‌ని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ చివర్లో స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. సరైన సమయంలో డబ్బులు కట్టేస్తే.. వడ్డీ పడదు.
కానీ పర్సనల్ లోన్ విషయంలో అలా ఉండదు. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు అందుతాయి. ఇన్స్టాల్మెంట్ ద్వారా ప్రతి నెలా వాటిని తీర్చేయాలి. ఈ ఇన్స్టాల్మెంట్ పీరియడ్.. సాధారణంగా 1 ఏడాది- 7ఏళ్ల మధ్యలో ఉంటుంది. అంతేకాదు.. దీనిపై వడ్డీ కూడా పడుతుంది.
పర్సనల్ లోన్:- పర్సనల్ లోన్‌లో లంప్సమ్ అమౌంట్ వస్తుంది. కాబట్టి.. అనుకోని, అత్యవసర ఖర్చులు ఏర్పడినప్పుడు.. పర్సనల్ లోన్ని తీసుకోవచ్చు. ఇంటి పనికోసమో, సొంత ఖర్చుల కోసమో వాడుకోవచ్చు.
Personal loans vs credit cards : అంతేకాకుండా.. అధిక వడ్డీతో కూడిన లోన్స్‌ని తీర్చేందుకు.. ఒకేసారి పర్సనల్ లోన్ని తీసుకోవచ్చు. అయితే.. ఈ పర్సనల్ లోన్ అనేది తక్కువ వడ్డీకి రావాలి. ఇలా చేస్తే.. మీ మీద ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.
పర్సనల్ లోన్‌లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డులతో పోల్చితే.. వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు డబ్బులు కడుతుంటే.. క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజ్‌లు.
అయితే.. పర్సనల్ లోన్‌లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోకూడదు. పైగా.. వీటి అప్లికేషన్ ప్రాసెస్, రీపేమెంట్ స్ట్రక్చర్.. క్రెడిట్ కార్డుతో పోల్చితే కష్టంగా ఉంటుంది. సరైన సమయానికి డబ్బులు కట్టకపోతే.. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
When should you consider using a personal loan : క్రెడిట్ కార్డు:- రోజువారీ ఖర్చులు.. అంటే.. గ్రాసరీ, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఆన్లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు వాడటం మంచి ఆప్షన్ అవుతుంది. ప్రతి నెలా ఇన్స్టెంట్గా క్రెడిట్ లిమిట్ వస్తుంది కాబట్టి.. మాటిమాటికి కొత్త లోన్ని అప్లై చేయాల్సిన పని ఉండదు. క్రెడిట్ కార్డులతో లబ్ధిపొందాలంటే.. ఎప్పటికప్పుడు తీసుకున్న డబ్బులను డ్యూ డేట్‌కి ముందే కట్టేయాలి. ఫలితంగా.. వడ్డీ పడదు.
అంతేకాకుండా.. ఈ మధ్య కాలంలో అనేక కంపెనీలు.. క్రెడిట్ కార్డులపై రివార్డ్స్ కూడా ఇస్తాయి. వాటిని.. ట్రావెల్, రెస్టారెంట్, షాపింగ్‌లో ఉపయోగించుకుని బిల్లులను తగ్గించుకోవచ్చు.
కానీ క్రెడిట్ కార్డును సరిగ్గా వాడటం తిలిస్తేనే.. దానిని తీసుకోవాలి! లేకపోతే.. మీపై ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ఎంత ఖర్చు చేస్తున్నామో ఐడియా లేకపోతే.. కార్డులో నుంచి డబ్బులు వెళిపోతూనే ఉంటాయి. వాటిని మళ్లీ కట్టేందుకు మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
When should you consider using a credit card : ఇక క్రెడిట్ కార్డులపై వసూలు చేసి వడ్డీ.. చాలా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పులను మేనేజ్ చేయలేని వారు.. ఈ వడ్డీని చూసే భయపడిపోతూ ఉంటారు.
అందుకే.. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి, పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే.. మీరు ముందడుగు వేయాలి. లేకపోతే.. భవిష్యత్తులో చాలా కష్టపడాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం