బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..-personal loans june 2025 steps to get lowest interest rates from banks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..

బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..

Sharath Chitturi HT Telugu

అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ పొందాలంటే ఏం చేయాలి? అసలు తక్కువ వడ్డీ రేటుకు లోన్​ తీసుకోవడం సాధ్యమేనా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అతి తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్ కావాలంటే ఇలా చేయండి..

డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా మనకు ఎదురవుతుందో చెప్పలేము. అందుకే ఒక ఎమర్జెన్సీ ఫండ్​ పెట్టుకోవాలి. చాలా మంది దీనిని నిర్లక్షం చేస్తుంటారు. చివరికి, అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్​ లోన్​వైపు చూస్తుంటారు. సాధారణంగా ఈ పర్సనల్​ లోన్స్​లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అది మన ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది. కానీ, పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు అతి తక్కువ వడ్డీకే పొందాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అది జరగడానికి మీరు ఏమి చేయాలి? ఏం చేస్తే తక్కువ వడ్డీ రేటుకు లోన్​ లభిస్తుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్..

1. అన్నింటికంటే ముందు, మీ పర్సనల్​ లోన్​ ఆవశ్యకతను గుర్తించండి. అది వివాహానికి ఖర్చు చేయడానికా? లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయడానికా? అని తెలుసుకోండి.

2. మీరు మీ అవసరాన్ని గుర్తించిన తర్వాత మొత్తం ఖర్చుల ప్రణాళికను రూపొందించండి. మీ ప్రత్యామ్నాయ నిధుల వనరుల ఆధారంగా కొంచెం ఎక్కువ లేదా తక్కువ రుణం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీరు రూ.2లక్ష పెట్టుకోగలిగితే, మీకు రూ.5 లక్షలు అవసరం అయితే కేవలం రూ.3 లక్షల పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది.

3. సౌకర్యవంతమైన షరతులతో పర్సనల్​ లోన్​ పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషించే మీ క్రెడిట్ స్కోర్​ని ఇప్పుడు చెక్​ చేయడం చాలా ముఖ్యం.

4. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే - ఉదాహరణకు 720 కంటే ఎక్కువ ఉంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి.

5. మీకు రెగ్యులర్ బ్యాంకింగ్ రిలేషన్​షిప్ ఉన్న బ్యాంకును సంప్రదించండి. మీ జీతం క్రెడిట్ అయ్యే బ్యాంకు నుంచి రుణం పొందడం సులభం! రెగ్యులర్​ కస్టమర్​ కాబట్టి.. మీరు మంచి డీల్స్​ కుదుర్చుకోవచ్చు.

6. అయితే, ఒక్క బ్యాంకుకే పరిమితం అవ్వకండి! ఒకటి లేదా రెండు బ్యాంకులను సంప్రదించి వారు మీకు ఏ వడ్డీ రేటుకు రుణం ఆఫర్​ చేస్తున్నారో తెలుసుకోండి.

7. అదే సమయంలో ఎక్కువ ఆర్థిక సంస్థలను ఆశ్రయించకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు లోన్​ ఇవ్వాలంటే సంస్థలు మీ క్రెడిట్​ స్కోర్​ని చూస్తాయి. మాటిమాటికి చూస్తే, మీ క్రెడిట్ స్కోర్​ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

8. మీ డాక్యుమెంట్లను ఆన్​లైన్​లో సబ్మిట్ చేసి లోన్ కోసం అప్లై చేయండి. ఈ డాక్యుమెంట్లు సాధారణంగా 3 నెలల వేతన స్లిప్పులు, అపాయింట్​మెంట్​ లెటర్, ఆధార్, పాన్, కంపెనీ ఐడీ.

9. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నందున మీ బ్యాంక్ రుణాన్ని టాప్ బ్యాంక్ తిరస్కరించినట్లయితే, మీరు ఆర్బీఐ-ఆమోదించిన ఎన్​బీఎఫ్​సీలు లేదా ఏదైనా రిజిస్టర్డ్ ఫిన్​టెక్​ ప్లాట్ఫామ్​లను సంప్రదించవచ్చు. దీనిని చివరి ఆప్షన్​గా పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్​లు సాధారణంగా అధిక వడ్డీ రేటుకు రుణాలను అందిస్తాయి.

(గమనిక- పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం