RBI rate cuts : ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో.. మన లోన్​లపై ప్రభావం ఎంత?-personal loans impact of rbi rate cuts on different types of loans ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Rate Cuts : ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో.. మన లోన్​లపై ప్రభావం ఎంత?

RBI rate cuts : ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో.. మన లోన్​లపై ప్రభావం ఎంత?

Sharath Chitturi HT Telugu
Jan 07, 2025 11:10 AM IST

RBI rate cuts: ఆర్బీఐ త్వరలోనే వడ్డీ రేట్లను కట్​ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇంతకాలం అత్యధిక వడ్డీ రేట్లను చూసిన ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో రేట్​ కట్​తో వివిధ లోన్లపై కనిపించే ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో.. మన లోన్​లపై ప్రభావం ఎంత?
ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో.. మన లోన్​లపై ప్రభావం ఎంత?

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా త్వరలోనే ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే విధంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరగనున్న మొనేటరీ పాలసీ మీటింగ్​లో వడ్డీ రేట్ల (లేదా రెపో రేటు) కోతను ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే వివిధ లోన్​లపై మనం కట్టాల్సిన వడ్డీ రేట్లు దిగొస్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో ఎలాంటి లోన్లపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

ఆర్బీఐ వడ్డీ రేట్లు కోత..

వడ్డీ రేట్లను రీపర్చేజ్ రేటు అని కూడా అంటారు. అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు బదులుగా ఆర్బీఐ.. వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతంగా ఉంది. రేట్​ కట్​ సైకిల్​ ప్రారంభమైతే డిపాజిట్​, రుణ రేట్లు సైతం తగ్గనున్నాయి.

అంటే రెపో రేట్లను తగ్గించినప్పుడు, డిపాజిటర్లు తమ డిపాజిట్లపై తక్కువ రేట్లు పొందుతారు. రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్లకు డబ్బును పొందొచ్చు.

రెపో రేటు ఎంత తక్కువగా ఉంటే బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలు ఇచ్చే రేట్లు అంత తక్కువగా ఉంటాయి. మరోవైపు, రెపో రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. రుణాలు, రుణ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

వ్యక్తిగత రుణంపై ప్రభావం ఎంత..?

బ్యాంకులు వడ్డీ రేట్లను వసూలు చేసేందుకు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. అవి.. డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, నిర్వహణ వ్యయాలు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వంటి అంశాలను కలిగి ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (లేదా ఎంసీఎల్ఆర్). కాబట్టి ఆర్బీఐ రెపో రేటు, సీఆర్ఆర్​ని పెంచినప్పుడు, బ్యాంకులు నిధులను సమీకరించడానికి అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. తద్వారా రుణ వ్యయం పెరుగుతుంది. ఇది బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీ రేట్లకు దారితీస్తుంది.

సాధారణంగా రెపో రేటు స్వల్పంగా పెరిగితే వడ్డీరేటు మరింత పెరగవచ్చు. కాబట్టి, బ్యాంకులు కొన్నిసార్లు రుణగ్రహీతపై అధిక భారాన్ని మోపుతాయి. రెపో రేటు తగ్గితే, వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది.

హోం లోన్​పై ప్రభావం ఎంత?

2025 ప్రథమార్థంలో ఆర్బీఐ.. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించవచ్చని జెఫరీస్ నివేదిక సూచించింది. అదే జరిగితే బ్యాంకులు గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (ఫ్లోటింగ్ రేట్లు) తగ్గే అవకాశం ఉంది. వాస్తవ ప్రభావం ఎంత ఉంటుంది అనేది బ్యాంకును బట్టి మారుతుంది. రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ఉండవచ్చు!

కారు లోన్​పై ప్రభావం ఎంత?

కస్టమర్​ ఎంచుకున్న ఆప్షన్​ బట్టి ఫిక్స్​డ్ లేదా ఫ్లోటింగ్ రేటుపై కారు లోన్ అందుతుంది. రుణ కాలపరిమితిలో ఫిక్స్​డ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. రెపో రేటులో మార్పును బట్టి ఫ్లోటింగ్ రేటు పైకి లేదా దిగువకు వెళుతుంది. కాబట్టి ఈ ఏడాది (2025) రెపో రేటు తగ్గితే, కారు లోన్​పై వడ్డీ రేటు కూడా తగ్గుతుంది!

Whats_app_banner

సంబంధిత కథనం