Personal loans tips : వ్యాపారులు సులభంగా పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..-personal loans for self employed 7 key tips to follow to overcome challenges ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Personal Loans Tips : వ్యాపారులు సులభంగా పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..

Personal loans tips : వ్యాపారులు సులభంగా పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయాలి..

Sharath Chitturi HT Telugu
Dec 07, 2024 07:00 AM IST

Personal loans for self-employed : వ్యాపారులు, స్వయం ఉపాధి గల వారికి పర్సనల్​ లోన్​ ఇస్తారా? అంటే ఇస్తారనే చెప్పాలి. కానీ దీని చుట్టు చాలా సవాళ్లు ఉన్నాయి. వాటి గురించి, వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వ్యాపారులు సులభంగా పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయండి..
వ్యాపారులు సులభంగా పర్సనల్​ లోన్​ పొందాలంటే ఇలా చేయండి..

డబ్బు అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవడం సాధారణమైన విషయం. వేతన జీవులకు సులభంగా దొరికే పర్సనల్​ లోన్​, వ్యాపారులు- స్వయం ఉపాధి ఉన్న వారు ఈజీగా పొందలేరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటే వ్యాపారులు సైతం పర్సనల్​ లోన్​ని సులభంగా పొందొచ్చు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

వ్యాపారులకు పర్సనల్​ లోన్​- సవాళ్లు..

1. అస్థిరమైన ఆదాయం: అస్థిరమైన నగదు ప్రవాహం, తద్వారా పడిపోయే రీపేమెంట్​ సామర్థ్యం వంటివి పర్సనల్​ లోన్​ ఇచ్చే బ్యాంకులకు అలరంగా ఉంటాయి.

2. అధిక వడ్డీ రేట్లు: నెలవారీ ఫిక్స్​డ్​ జీతం లేకపోయినా వ్యాపారులకు బ్యాంకులు పర్సనల్​ లోన్​ ఇచ్చినప్పటికీ, అవి అధిక వడ్డీ రేట్లతో వస్తాయి. ఇది ఆర్థిక భారానికి దారితీస్తుంది.

3. మరిన్ని డాక్యుమెంట్లు అవసరం: రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులను ఒప్పించడానికి, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఎక్కువ డాక్యుమెంట్స్​ సమర్పించాల్సి ఉంటుంది.

4. తక్కువ కాలపరిమితి: బ్యాంకులు సాధారణంగా వ్యాపారులు, స్వయం ఉపాధి రుణగ్రహీతలకు తక్కువ రుణ చెల్లింపు వ్యవధిని అందిస్తాయి. ఫలితంగా ఇన్​స్టాల్మెంట్​ డబ్బులు ఎక్కువగా ఉంటాయి.

5. వాస్తవ ఆదాయం: చాలా మంది స్వయం ఉపాధి వ్యక్తులు పన్ను ప్రయోజనాల కోసం ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తారు. ఇది వారి రుణ అర్హతను దెబ్బతీస్తుంది.

ఈ సవాళ్లను అధిగమించడానికి పాటించాల్సిన 7 టిప్స్​:

1. అధిక క్రెడిట్ స్కోర్: క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండటం తప్పనిసరి. సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే వ్యాపారులు, స్వయం ఉపాధి గల వారు పర్సనల్​ లోన్​ పొందే అవకాశాలు పెరుగుతాయి.

2. ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు: బ్యాంకులకు తరచుగా స్వయం ఉపాధి వ్యక్తుల నుంచి మరింత విస్తృతమైన డాక్యుమెంటేషన్ అవసరం. ఈ డాక్యుమెంట్లలో స్థిరమైన నగదు ప్రవాహాన్ని చూపించడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటిఆర్), 6 నుంచి 12 నెలల బ్యాంక్ స్టేట్​మెంట్లు అడుగుతారు. వీటితో పాటు బ్యాంకులకు ప్రాఫిట్​ అండ్​ లాస్​ స్టేట్​మెంట్లు, భవిష్యత్ ఆదాయాన్ని సూచించే ఖాతాలు అవసరం కావచ్చు.

3. ఆదాయ వృద్ధి: గత కొన్నేళ్లుగా స్థిరమైన లేదా పెరుగుతున్న ఆదాయానికి బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి. ఒకవేళ హెచ్చుతగ్గులకు లోనైతే సపోర్టింగ్ డాక్యుమెంట్లతో వివరించాలి. అదనంగా, కనీసం 2 నుంచి 3 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న వ్యాపారం.. రుణదాతలకు భరోసా ఇస్తుంది.

4. పూచీకత్తు: స్థిరమైన ఆదాయం లేదా మంచి క్రెడిట్ ఉన్న సహ-సంతకందారు (కో సైనర్​) మీ దరఖాస్తును మెరుగుపరచవచ్చు. సెక్యూర్డ్ రుణాలు (ఆస్తి లేదా పెట్టుబడులు వంటి ఆస్తుల మద్దతుతో) తరచుగా తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ఆమోదాన్ని కలిగి ఉంటాయి.

5. రుణదాతను తెలివిగా ఎంచుకోండి: సాంప్రదాయ బ్యాంకులకు సాధారణంగా కఠినమైన డాక్యుమెంటేషన్ అవసరం. కానీ మంచి రేట్లను అందించవచ్చు. దీనికి విరుద్ధంగా, ఫిన్​టెక్ రుణదాతలు సాధారణంగా సరళమైన ప్రమాణాలను కలిగి ఉంటారు కాని అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తారు.

6. తక్కువ రుణం: అధిక డెట్-టు-ఇన్కమ్ (డీటీఐ) రేషియో మీ అవకాశాలను దెబ్బతీస్తుంది. కాబట్టి, రుణం- ఆదాయ నిష్పత్తి 40 శాతం కంటే తక్కువ ఉండేడట్టు చూసుకోండి.

7. బ్యాంకుతో సంబంధాలు: మీకు ఇప్పటికే ఖాతా ఉన్న బ్యాంకులు మీకు రుణం ఇచ్చేందుకు ముందుకు రావొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం