వడ్డీ రేట్లే కాదు- లోన్​ తీసుకునేటప్పుడు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి..-personal loan tips in telugu aside from interest rate these are the factors to examine ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వడ్డీ రేట్లే కాదు- లోన్​ తీసుకునేటప్పుడు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి..

వడ్డీ రేట్లే కాదు- లోన్​ తీసుకునేటప్పుడు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి..

Sharath Chitturi HT Telugu

పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? వడ్డీ రేట్లు చూస్తే సరిపోతుంది? అని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్టే! పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు ఇంకొన్ని అంశాలపైనా దృష్టి పెట్టాలి. అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. అవేంటంటే..

పర్సనల్​ లోన్​ తీసుకునేముందు ఇవి కూడా తెలుసుకోవాలి..

ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అవసరం ఏదైనా, పర్సనల్​ లోన్​వైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంకులు సైతం త్వరితగతిన లోన్​లు మంజూరు చేస్తున్నాయి. అయితే, సాధారణంగా పర్సనల్​ లోన్​ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను మాత్రమే చూస్తుంటాము. కానీ వ్యక్తిగత రుణం విషయంలో వడ్డీ రేట్లతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాల్లో ప్రాసెసింగ్ ఛార్జీలు, బ్యాంకు లేదా రుణదాతల విశ్వసనీయత, హిడెన్​ ఛార్జీలు వంటివి ఉంటాయి. వాటి వివరాలు..

పర్సనల్​ లోన్​ టిప్స్​- ఇవి కూడా పరిశీలించాలి..

I. ప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు పర్సనల్​ లోన్​ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణదాత రుణ మొత్తంలో కొంత భాగాన్ని ప్రాసెసింగ్ ఛార్జీలుగా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు 5 శాతం వరకు ఉండవచ్చు! కాబట్టి, ఒక బ్యాంక్ తక్కువ వడ్డీని వసూలు చేసినా, ప్రాసెసింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటే, అది మీకు భారంగా మారవచ్చు. మీరు ఆశించినంత డబ్బులు అందకపోవచ్చు.

II. రుణదాతల విశ్వసనీయత: లోన్​ తీసుకుంటున్న సంస్థ విశ్వసనీయత మరొక ముఖ్యమైన అంశం. సాధారణంగా, సౌకర్యవంతమైన నిబంధనలతో రుణాలు అందించే ప్రసిద్ధ బ్యాంకింగ్ సంస్థలను మొదట సంప్రదించడం మంచిది.

లేదంటే, మీరు ఎన్‌బీఎఫ్‌సీ (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్) లేదా ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నియంత్రించే సంస్థలు భాగస్వామ్యం చేసుకునే లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ (ఎల్​ఎస్​పీ) లను కూడా సంప్రదించవచ్చు. తెలియని, అనుమతి లేని యాప్స్​ నుంచి సులభంగా లోన్​లు పొందవచ్చు. కానీ వడ్డీ వసూలు విషయంలో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

III. హిడెన్​ ఛార్జీలు: కొన్ని రుణదాతలు హిడెన్​ ఛార్జీలను కూడా విధిస్తుంటారు. మీరు సంతకం చేసే ముందు నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదవడం చాలా ముఖ్యం. అదనంగా, మీరు వ్యక్తిగత రుణ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించి కాలపరిమితి, రుణ మొత్తం, వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకున్న తర్వాత అసలు ఈఎంఐ ఎంత అవుతుందో తనిఖీ చేయవచ్చు.

మీ ఈఎంఐ, కాలిక్యులేటర్ చూపిన దానికంటే ఎక్కువగా ఉంటే, హిడెన్​ ఛార్జీలు ఉన్నాయని అర్థం.

IV. కస్టమర్ సర్వీస్: చివరిగా, కస్టమర్ సర్వీస్ అనేది మీరు రుణదాతను ఎంపిక చేసుకునేటప్పుడు పరిగణించాల్సిన మరో కీలక అంశం. మీ స్నేహితులను అడగవచ్చు, రెడ్డిట్, యూట్యూబ్, ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమీక్షలను చెక్​ చేయవచ్చు. ఆ తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు.

పర్సనల్​ లోన్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం