Personal Loan tips : అప్పులను తీర్చడానికి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? లేక మనకే నష్టమా?
Personal Loan tips in Telugu : ఉన్న అప్పులు తీర్చేందుకు కొత్త పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇలా లోన్ తీసుకోవడం మంచిదేనా? లేక నష్టం జరుగుతుందా? పూర్తి వివరాలు..
డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో తెలియదు. అందుకే చాలా మంది ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్వైపు చూస్తున్నారు. బ్యాంకులు కూడా వేగంగా మంజూరు చేయడంతో ఈ తరహా లోన్స్ చాలా అట్రాక్టివ్‌గా మారుతున్నాయి. అయితే, కొందరు ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చేందుకు కూడా కొత్త పర్సనల్ లోన్ని తీసుకుంటున్నారు. ఇది మంచి విషయమేనా? లేక ఇలా చేస్తే మనం నష్టంపోతామా? అసలు ఏ సందర్భాల్లో పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అప్పులు కట్టేందుకు పర్సనల్ లోన్: ఈ సందర్భాల్లో బెటర్..
అప్పు తీర్చేందుకు పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవచ్చంటే..
1. మీ రుణ బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడు, అదే సమయంలో వడ్డీ రేటు విపరీతంగా ఉన్నప్పుడు.
2. కొత్త రుణాలు తక్కువ వడ్డీ రేటుతో వస్తున్నప్పుడు. ఈ విధంగా మీరు రెండు సెట్ల రుణాల మధ్య వడ్డీ వ్యత్యాసం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
3. మీరు మంచి సంబంధాన్ని పంచుకునే బ్యాంకు ద్వారా కొత్త పర్సనల్ లోన్ పొందినప్పుడు. ఈ విషయంలో వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉండొచ్చు!
4. పాత లోన్ కాలపరిమితి సమీపిస్తున్నప్పుడు. గడువులోగా మీరు చెల్లించలేరని అర్థమైతే లోన్ తీసుకోవడం బెటర్.
5. ప్రస్తుత రుణ బాధ్యతలు అనేక ఆర్థిక సంస్థలకు సంబంధించినవి అయితే వాటిని ఒకేసారి కట్టేందుకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
ఉదాహరణకు, వివిధ సంస్థల నుంచి మొత్తం రూ.10 లక్షల బాధ్యతతో మీకు నాలుగు రుణాలు ఉన్నప్పుడు - ఈ రుణాలను బదులుగా రూ .10 లక్షలకు సంబంధించిన ఒకే లోన్ తీసుకోవడం మంచిది.
రుణం తిరిగి చెల్లించడానికి లోన్: ఈ సందర్భాల్లో వద్దు..
1. కొత్త రుణంపై వడ్డీ ప్రస్తుత రుణ బాధ్యతల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఉదాహరణకు, ప్రస్తుతం మీరు మీ ప్రస్తుత లోన్‌పై 10.5 శాతం చెల్లిస్తుండగా, కొత్త రుణం 11 శాతం వద్ద అందిస్తున్నప్పుడు మీకే నష్టం. దీన్ని ఎందుకు ఎంచుకోవాలి? అవునా కాదా?
2. కొత్త రుణాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తున్న కొత్త బ్యాంకు గురించి మీకు తెలియనప్పుడు, రుణంపై అధిక ఛార్జీలు కూడా విధిస్తున్నప్పుడు.
3. ఇప్పుడున్న లోన్ అమౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, మరో లోన్ తీసుకుని, ఆర్థిక భారం పెంచుకుని పాత దాన్ని తిరిగి చెల్లించడం ఎందుకు?
(గమనిక:- పర్సనల్ లోన్ తీసుకోవడం రిస్క్ అని గ్రహించాలి.)
సంబంధిత కథనం