Tips To Investors : పెట్టుబడి పెట్టే సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఆలోచించండి
Investing Tips : డబ్బులు పెట్టుబడి పెట్టే సమయంలో అన్ని విషయాలను అంచనా వేసుకోవాలి. చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు. పెట్టుబడి ఎందకు పెడుతున్నారో లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సరైన ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే మీ డబ్బులకు ఫలితం ఉంటుంది. సాధారణంగా పెట్టుబడి సమయంలో కొన్ని తప్పులు చేస్తారు.
ఎందులోనైనా పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను కూడా అంచనా వేయాలి. ప్రతిదీ గమనించాలి. ఈ సమయంలో మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. నష్టాలను నివారించేందుకు పెట్టుబడి ఆపదలను గుర్తించాలి. చిన్న పెట్టుబడిదారులు చేసే సాధారణ తప్పులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
ఆర్థిక లక్ష్యాలు
ఆర్థిక లక్ష్యాలు అనగా పిల్లల చదువు కోసం పొదుపు చేయడం, పదవీ విరమణ కోసం సిద్ధం చేయడం, విదేశాల్లో విహారయాత్రకు ప్లాన్ చేయడం లేదా మీ పిల్లల పెళ్లికి ఆర్థికి ఉపయగపడేలా ఇన్వెస్ట్ చేయడం వంటివి. ఇవి నిర్దిష్ట కాలపరిమితిలో మీరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలు. ఈ లక్ష్యాలను నిర్ణయించడం ద్వారా మీరు సంపాదించాల్సిన మొత్తం, దాని కోసం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవలసిన మొత్తం గురించి మీకు స్పష్టమైన ఆలోచన ఉంటుంది. మీరు నిర్దిష్ట ప్రణాళికను ఎంచుకోవచ్చు. చాలా మంది ఆర్థిక లక్ష్యాలు లేకుండా పెట్టుబడి పెడతారు. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.
జీవిత బీమా పాలసీ
జీవిత బీమా పాలసీ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అనుకోని మరణం లేదా మరేదైనా ప్రమాదం సంభవించినప్పుడు అతని కుటుంబం ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందేలా చేయడం. జీవిత బీమా పాలసీ కవరేజ్ మొత్తం బీమా చేసిన వ్యక్తి వార్షిక ఆదాయంలో కనీసం 10 నుండి 15 శాతం ఉండాలి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇన్వెస్టింగ్‌తో బీమాను కలిపేస్తారు. ఇది మనీబ్యాక్ పాలసీలను తీసుకునేలా చేస్తుంది. అందులో భాగంగా తక్కువ మెుత్తంతో పాలసీ చేస్తారు. ఈ రకమైన బీమా పాలసీలు తరచుగా తగిన కవరేజీని అందించకపోవడమే కాకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆదాయాన్ని కూడా అందించవు.
అత్యవసర నిధి
అత్యవసర నిధిని సృష్టించడం ప్రాథమిక ఉద్దేశ్యం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం. ఉద్యోగ నష్టం, అనారోగ్యం కారణంగా ఆదాయానికి అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైన ఖర్చులను తీర్చడం దీని ఉద్దేశం. అయితే తగినంత అత్యవసర నిధులు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునే అవకాశం ఉంది. సంక్షోభ సమయాల్లో మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి తగిన అత్యవసర నిధిని ఉండేలా చేయడం అవసరం.
ద్రవ్యోల్బణం
చాలా మంది పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలపై ద్రవ్యోల్బణం ప్రభావాలను మరిచిపోతారు. ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వేగంగా వస్తువుల డిమాండ్ పెంచడమే కాకుండా ధరలను కూడా పెంచుతుంది. అందువల్ల ఆర్థిక లక్ష్యాల కోసం తగినంత నిధులను రూపొందించడం సాధ్యం కాదు. మీ ఆర్థిక లక్ష్యాల కోసం అవసరమైన మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణ సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బును ఉపయోగించకుండా ఉంటారు.
ఎమోషన్స్
పెట్టుబడిదారులు తమ పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయడానికి భయం, దురాశ వంటి వారి భావోద్వేగాలు కూడా కారణమవుతాయి. ఈక్విటీలు ఆకర్షణీయంగా ధరలను కలిగి ఉన్నప్పటికీ, భయం వారి ప్రస్తుత పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి లేదా మార్కెట్ నష్టాల సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటానికి కారణం కావచ్చు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని ప్రోత్సహించడానికి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించండి. ఎందుకంటే SIPలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తాయి.