Smartwatch: అమోలెడ్ డిస్‍ప్లే, మెటాలిక్ స్ట్రాప్‍లతో పెబల్ నయా స్మార్ట్‌వాచ్ లాంచ్: వివరాలివే
Pebble Cosmos Vault Smartwatch: పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. అమోలెడ్ డిస్‍ప్లే, మెటాలిక్ స్ట్రాప్స్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చింది. సేల్ కూడా మొదలైంది.
Pebble Cosmos Vault Smartwatch: మెటాలిక్ స్ట్రాప్‍ను ఇష్టపడే వారి కోసం మార్కెట్‍లోకి మరో స్మార్ట్‌వాచ్ వచ్చింది. పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉండే డిస్‍ప్లే ఉండడం ఈ వాచ్‍కు మరో హైలైట్‍గా ఉంది. బ్లూటుత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. హెల్త్ ఫీచర్లు, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లతో ఈ వాచ్ వచ్చింది. ఇప్పటికే సేల్‍కు కూడా అందుబాటులో ఉంది. ఈ పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.
పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
మెటాలిక్ బాడీ, మెటాలిక్ స్ట్రాప్‍లను పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 1.43 ఇంచుల అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లే ఉంటుంది. 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్, ఆల్వే ఆన్ డిస్‍ప్లే ఫీచర్లు ఉంటాయి. ఇక బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వచ్చింది. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని నేరుగా ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడచ్చు.
నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎస్‍పీఓ2 మానిటర్ లాంటి హెల్త్ ఫీచర్లను పెబల్ కాస్మోస్ వాల్ట్ కలిగి ఉంది. విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. డిఫరెంట్ వాచ్ ఫేస్‍లు కూడా అందుబాటులో ఉంటాయి.
పెబల్ కాస్మోస్ వాల్ట్ వాచ్‍లో 240mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని పెబల్ పేర్కొంది. ఇక మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో ఈ వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
పెబల్ కాస్మోస్ వాల్ట్ ధర సేల్
పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, మింత్రాతో పాటు పెబల్ వెబ్‍సైట్‍లోనూ ఈ వాచ్ సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ సిల్వర్, రోజ్ గోల్డ్, క్లాసిస్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.