Paytm UPI Lite Wallet: పేటీఎం యూపీఐ లైట్ వాలెట్ ద్వారా పిన్ అవసరం లేకుండా వేగంగా, సులభంగా లావాదేవీలు చేయవచ్చు. దీన్ని ఉపయోగించి, మీరు లావాదేవీలను వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు. పేటీఎం బ్రాండ్ యాజమాన్య సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ ఇప్పుడు తక్కువ విలువ కలిగిన రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ లైట్ వాలెట్ పై దృష్టి సారించింది. పేటీఎం యూపీఐ లైట్ ఆన్-డివైజ్ వాలెట్ గా పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులకు డబ్బులను నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు చెల్లింపులు చేయవచ్చు. ఈ యూపీఐ లైట్ ద్వారా చిన్న చిన్న మొత్తాలను పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే వేగంగా చెల్లించవచ్చు.
పేటీఎం యూపీఐ లైట్ వాలెట్ వినియోగదారులు రూ.500 వరకు తక్షణ లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండు సార్లుక గరిష్టంగా రూ.2,000 వరకు మీ పేటీఎం యూపీఐ లైట్ వాలెట్ లో జమ చేసుకోవచ్చు. అంటే, మొత్తంగా, రోజుకు రూ. 4 వేలను వ్యాలెట్ లో జమ చేసుకోవచ్చు. కిరాణా సరుకుల బిల్లులు, పార్కింగ్ చార్జెస్, మెట్రో టికెట్స్, ప్రయాణ చార్జీల వంటి చిన్న చెల్లింపులు చేసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పేటీఎం యాప్ లో పేటీఎం యూపీఐ లైట్ ను యాక్టివేట్ చేయడానికిి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
పేటీఎం లావాదేవీల కోసం వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యెస్ బ్యాంక్ వంటి ప్రముఖ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ల (పీఎస్పీ) లతో భాగస్వామ్యం కుదుర్చుకుందని పేటీఎం తెలిపింది. "ఇంకా, యూపీఐ లైట్ వాలెట్ ఉపయోగించి చెల్లింపులు చేయడానికి, ఏదైనా యూపీఐ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. లేదా మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నంబర్ ను నమోదు చేయండి. లేదా కాంటాక్ట్స్ జాబితా నుండి మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ ను ఎంచుకోండి. చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి, ఒక సారి సరి చూసుకోని సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అయితే, ఇది చిన్న చిన్న చెల్లింపులకే ప్రయోజనకరం. పెద్ద మొత్తాలను దీని ద్వారా చెల్లించడం సాధ్యం కాదు.