పేటీఎం తన యాప్‌లో గోప్యతకు సంబంధించిన ఒక ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త హైడ్ పేమెంట్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి చెల్లింపు హిస్టరీ నుండి ఏదైనా లావాదేవీని దాచవచ్చు. మరెవరూ చూడకూడదని మీరు కోరుకునే చెల్లింపును కనిపించకుండా చేయవచ్చు.
ఈ లావాదేవీ అదృశ్యమవుతుంది కానీ పూర్తిగా తొలగిపోదు. ఇది వినియోగదారు మాత్రమే యాక్సెస్ చేయగల సురక్షిత విభాగంలో సేవ్ అవుతుంది. పేటీఎం యాప్ తాజా వెర్షన్‌లో కొత్త హైడ్ పేమెంట్ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని, క్రమంగా అందరు వినియోగదారులకు యాక్టివేట్ అవుతోందని పేటీఎం తెలిపింది.
పేటీఎంలో పేమెంట్ వివరాలను దాచాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
స్టెప్ 1 : పేటీఎం యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగానికి వెళ్లాలి.
స్టెప్ 2 : మీరు దాచాలనుకుంటున్న పేమెంట్‌పై ఎడమవైపు స్వైప్ చేయండి.
స్టెప్ 3 : ఆప్షన్ కనిపించగానే 'హైడ్' మీద ట్యాప్ చేయండి.
స్టెప్ 4 : కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ వద్ద ఎస్ ఎంచుకోవడం ద్వారా ధృవీకరించండి.
స్టెప్ 5 : ఇప్పుడు ఆ పేమెంట్ మీ పేమెంట్ హిస్టరీ నుంచి హైడ్ అవుతుంది.
1. పేటీఎం యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ అండ్ హిస్టరీ విభాగానికి వెళ్లండి.
2. 'పేమెంట్ హిస్టరీ' పక్కన ఉన్న మూడు చుక్కల ఐకాన్ మీద క్లిక్ చేయండి.
3. మెనూ నుండి వ్యూ హిడెన్ పేమెంట్స్ ఎంచుకోండి.
4. మీ మొబైల్ హ్యాండ్సెట్ యాక్సెస్ పిన్ ఎంటర్ చేయండి లేదా బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్ / ఫేస్) వెరిఫికేషన్ అందించండి.
5. మీరు చూపించాలనుకుంటున్న లావాదేవీపై ఎడమకు స్వైప్ చేసి అన్‌హైడ్ మీద ట్యాప్ చేయండి.
6. లావాదేవీ ఇప్పుడు మీ పేమెంట్ హిస్టరీలో మళ్లీ కనిపిస్తుంది.
ఈ ఫీచర్ ప్రత్యేకంగా తమ ఫోన్‌లను ఇతరులతో పంచుకునే వినియోగదారులకు ఉపయోగపడుతుంది. తమ ఫోన్ స్క్రీన్‌పై లావాదేవీ హిస్టరీ చూడగలిగే పరిస్థితుల్లో ఉన్న వినియోగదారుల కోసం ఇది రూపొందించారు. వినియోగదారుడు తనకు కావలసినప్పుడు లావాదేవీలను దాచవచ్చు.