WhatsApp : ఇక వాట్సాప్​ నుంచే కరెంట్​, ఫోన్​ బిల్లులు కట్టేయొచ్చు! కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది..-paying electricity phone bills on whatsapp could soon be a reality see details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp : ఇక వాట్సాప్​ నుంచే కరెంట్​, ఫోన్​ బిల్లులు కట్టేయొచ్చు! కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది..

WhatsApp : ఇక వాట్సాప్​ నుంచే కరెంట్​, ఫోన్​ బిల్లులు కట్టేయొచ్చు! కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Published Feb 08, 2025 06:46 AM IST

WhatsApp bill payment feature : త్వరలోనే మీరు వాట్సాప్​ నుంచే కరెంట్​ బిల్లు, ఫోన్​ రిఛార్జ్​లు, ఎల్​పీజీ సిలిండర్​ పేమెంట్స్​ వంటివి చేసే ఛాన్స్​ ఉంది! ఈ మేరకు ఈ ఇన్​స్టెంట్​ మెసేజింగ్​ యాప్​ కొత్త ఫీచర్​ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​..!
వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్​..! (unsplash)

యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు దిగ్గజ మెసేజింగ్​ యాప్​ సోషల్​ మీడియా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా అనేక ఫీచర్స్​ని లాంచ్​ చేసింది. ఇక ఇప్పుడు భారత వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్​ని సంస్థ తీసుకురాబోతోందని సమాచారం! ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. ఇక వాట్సాప్​ నుంచే కరెంట్​ బిల్లులు, ఫోన్​ బిల్లులు కట్టేయొచ్చని సమాచారం!

వాట్సాప్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్​ ఓనర్​ మెటా.. భారతదేశంలో తన ఆర్థిక సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యుటిలిటీ బిల్లుల పేమెంట్​ ఆప్షన్​ని సైతం యాప్​లో తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే వినియోగదారులను యూపీఐ ద్వారా కాంటాక్ట్స్, వ్యాపారాలకు డబ్బు పంపడానికి అనుమతిస్తుంది. ఇన్​స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం త్వరలో వివిధ కేటగిరీలకు పేమెంట్శ్​ని ప్రవేశపెట్టవచ్చు. వీటిలో కరెంట్​ బిల్లులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్​లు, ఎల్​పీజీ గ్యాస్ పేమెంట్స్​, వాటర్​ బిల్లులు, ల్యాండ్​లైన్​ పోస్ట్​పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు కూడా ఉండవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం బీటాలో ఉందని తెలుస్తోంది. మొబైల్ చెల్లింపుల కోసం ఒక ఎంప్టీ యాక్టివిటీ పేజీ ఇప్పటికే యాప్ తాజా బీటా వెర్షన్ లో యాడ్ అయిందని తెలుస్తోంది.

వాట్సాప్​ కొత్త ఫీచర్​ వచ్చేది ఎప్పుడు?

వివిధ యుటిలిటీలు, సేవల కోసం నేరుగా వాట్సప్​లోనే చెల్లింపులు జరపడం యూజర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇది ఇతర పేమెంట్​ యాప్స్​పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది! డిజిటల్ పేమెంట్స్​ మార్కెట్​లో వాట్సాప్ గణనీయమైన వాటాను ఆకర్షించడానికి ఈ ఫీచర్​ సహాయపడుతుంది. భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఇన్​స్టెంట్​ మెసేజింగ్ కోసం వాట్సప్​ని ఉపయోగిస్తున్నందున, ఈ యాప్​కి ఇప్పటికే విస్తృతమైన నెట్​వర్క్​ ఉంది. ఇది వాట్సాప్​కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే భారత మార్కెట్​లో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. భారత్​లో ఆమోదం పొందడానికి ముందు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని ఆండ్రాయిడ్ అథారిటీ సూచిస్తోంది. అదనంగా, ఈ ఫీచర్ ఇంకా క్రియాశీల అభివృద్ధిలో ఉందని గమనించాలి. కాబట్టి ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

వాట్సాప్​లో ఈ కొత్త ఫీచర్స్​ చూశారా?

2025 జనవరిలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో వాట్సాప్​ వినియోగదారుల కోసం ఏకంగా 6 కొత్త ఫీచర్స్​ని ప్రవేశపెట్టింది వాట్సాప్​. ఈ అప్డేట్లలో కొన్ని గతంలో బీటాలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. తాజా ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడానికి, మీరు మీ వాట్సాప్​ని లేటెస్ట్​ వెర్షన్​కి అప్​డేట్ చేయాల్సి ఉంటుంది.

చాట్ కోసం ఏఐ స్టూడియో..

వాట్సాప్​ ఏఐ స్టూడియో ఫీచర్​ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారులను వివిధ ఏఐ పర్సనాలిటీలతో నిమగ్నం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఇంటరాక్షన్​కి ఫన్​ని యాడ్​ చేస్తాయి. ఫేమస్​ పర్సనాలిటీస్​ నుంచి వివిధ వ్యక్తుల రోల్స్​ని ఈ పర్సనాలిటీస్​ కలిగి ఉంటాయి. మెటా ఏఐ చాట్ విండో ద్వారా మీరు ఈ ఫీచర్​ని యాక్సెస్ చేసుకోవచ్చు.

వాట్సాప్​ ఫీచర్స్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం