Parliament budget session: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే, ఈ సమావేశాలకు సంబంధించిన తేదీల గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సారి బడ్జెట్ సమావేశాలు (Parliament budget session) జనవరి 31న ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అలాగే, ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ను ప్రవేశపెట్టనున్నారు. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు.
ఈ మధ్యంతర బడ్జెట్‌లో, మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండవచ్చని తెలుస్తోంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ. 12,000 కోట్లు అదనంగా ఖర్చు కావచ్చు. ఈ అంశాన్ని ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం ఉంది. పాలక ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో లేదా పూర్తి బడ్జెట్‌కు తగినంత సమయం లేనప్పుడు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం మొత్తం వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తుంది.
ఈ సంవత్సరం, గత సంవత్సరాల మాదిరిగా సుదీర్ఘమైన ఆర్థిక సర్వేకు బదులుగా, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌కు ముందు 2024–25 సంవత్సరానికి గానూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై సంక్షిప్త నివేదికను సమర్పిస్తారు. జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది ఈ 17వ లోక్‌సభ చివరి సెషన్‌గా ఉంటుంది. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా జూలై 2024 వరకు, అంటే, నాలుగు నెలల పాటు జరిగే వ్యయంపై పార్లమెంటు ఆమోదం కోరుతుంది.
టాపిక్