Oyo to layoff 600 employees: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ఓయో..-oyo to layoff 600 execs across technology teams hire 250 for sales ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oyo To Layoff 600 Execs Across Technology Teams, Hire 250 For Sales

Oyo to layoff 600 employees: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ఓయో..

HT Telugu Desk HT Telugu
Dec 03, 2022 10:04 PM IST

Oyo to layoff 600 employees: టెక్ దిగ్గజాల బాటలో నడవాలని మల్టీ నేషనల్ ఓయో నిర్ణయించింది. సంస్థ నుంచి సుమారు 600 మంది ఉద్యోగులను సాగనంపాలని నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

Oyo to layoff 600 employees: యురోపియన్ వేకేషన్ బిజినెస్ లో కీలక మార్పులు చేపట్టిన ఓయో.. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ప్రొడక్ట్స్ టీమ్ ల నుంచి కనీసం 600 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. సంస్థ వివిధ విభాగాల్లో అవసరమైన స్థాయిలోనే ఉద్యోగులను నియమించే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గానూ, కొన్ని విభాగాలను మూసేయడం, మరికొన్ని విభాగాలను విలీనం చేయడం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Oyo to layoff 600 employees: సేల్స్ టీమ్ లో చేరికలు

టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాల నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్న ఓయో.. మరోవైపు సేల్స్ విభాగంలో కొత్తగా 250 మందిని చేర్చుకోవాలని భావిస్తోంది. ఒయోలో మొత్తం 3700 మంది ఉద్యోగులున్నారు. వారిలో కనీసం 15% నుంచి 20% వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. ముఖ్యంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్ నుంచి ఈ తొలగింపులు ఉంటాయి. అదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని హైర్ చేసుకోవాలని ఓయో నిర్ణయించింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయో తెలిపింది. అలాగే, ప్రొడక్ట్, ఇంజినీరింగ్ టీమ్ లను విలీనం చేయనుంది.Oyo to layoff 600 employees:

WhatsApp channel