Oracle job cuts : ఒరాకిల్​లో మళ్లీ ఉద్యోగాల కోత.. వందలాది మంది ఔట్​!-oracle job cuts news company fires hundreds of workers and also cancels job offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oracle Job Cuts News Company Fires Hundreds Of Workers And Also Cancels Job Offers

Oracle job cuts : ఒరాకిల్​లో మళ్లీ ఉద్యోగాల కోత.. వందలాది మంది ఔట్​!

Sharath Chitturi HT Telugu
Jun 16, 2023 01:04 PM IST

Oracle job cuts : ప్రముఖ టెక్​ సంస్థ ఒరాకిల్​.. మరోమారు ఉద్యోగాల కోతకు సిద్ధపడింది. సంస్థకు చెందిన హెల్త్​ యూనిట్​లోని అనేక మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది.

ఒరాకిల్​లో మళ్లీ జాబ్​ కట్స్​..
ఒరాకిల్​లో మళ్లీ జాబ్​ కట్స్​.. (REUTERS)

Oracle layoff 2023 : టెక్​ సంస్థలను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అందుకే.. ఏడాదిగా సాగుతున్న కాస్ట్​ కటింగ్​ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దిగ్గజ టెక్​ సంస్థ ఒరాకిల్​ మరోమారు జాబ్​ కట్స్​కు సిద్ధమైంది. సంస్థలోని హెల్త్​ యూనిట్​లో లేఆఫ్​లు మొదలుపెట్టింది. దీనితో పాటు ఇటీవల ఇచ్చిన జాబ్​ ఆఫర్స్​ని సైతం సంస్థ వెనక్కి తీసుకుంటోందని తెలుస్తోంది. ఓపెనింగ్స్​ని కూడా తగ్గించుకుంటోందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

సెర్నర్​లో ఉద్యోగాల కోత..

సెర్నర్​ అనే ఎలక్ట్రానిక్​ మెడికల్​ రికార్డ్స్​ సంస్థను 2021 డిసెంబర్​లో 28.3 బిలియన్​ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది ఒరాకిల్​. ఇప్పుడు ఇదే హెల్త్​ యూనిట్​లో ఉద్యోగాల చేపట్టింది. అమెరికా, యూరోప్​ కార్యాలయాల్లోని ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇండియాలోనూ ఒరాకిల్​కు వర్క్​ఫోర్స్​ ఎక్కువగానే ఉంది. కానీ తాజా జాబ్​ కాట్స్​.. ఇండియాలో ఎంత ప్రభావం చూపిస్తాయన్న విషయం ఇంకా తెలియలేదు.

ఒరాకిల్​లోని సెర్నర్​ డివిజన్ గతంలో యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ వెటర్న్స్​ అఫైర్స్​ ఆఫీస్​తో ఓ కాంట్రాక్ట్​ కుదుర్చుకుంది. ప్రజల ఆరోగ్య సమాచారానికి సంబంధించిన నిర్వహణ, స్టోరేజ్​ వంటి పనులు చేయడం ఈ కాంట్రాక్ట్​లో భాగం. అయితే.. సెర్నర్​ సాఫ్ట్​వేర్​లో చాలా లోపాలు ఉన్నాయంటూ.. కాంట్రాక్ట్​ని నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జాబ్​ కాట్స్​ వార్త కూడా బయటకు రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న నివేదిక ప్రకారం.. 4 నెలల సివరెన్స్​ పే.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఒరాకిల్​ ఇస్తోంది.

అయితే.. సెర్నర్​ హెల్త్​ యూనిట్​ నుంచి ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారు అన్న విషయంపై సరైన క్లారిటీ రాలేదు.

ఇదీ చూడండి:- Layoffs in India : ఇండియాలోనూ.. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి!

సెర్నర్​ మాజీ సభ్యులు, ఉద్యోగులు.. ప్రస్తుతం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా నిలుస్తూ.. సోషల్​ మీడియాలో పోస్టులు చేశారు.

"మీ గురించి నేను చాలా బాధపడుతున్నాను. సెర్నర్​ చాలా మంచి సంస్థ. మనకి చాలా విషయాలు నేర్పించింది. మీ సామర్థ్యంపై నమ్మకంగా ఉండండి," అని సెర్నర్​ ప్రొఫెషనల్​ సర్వీసెస్​ మాజీ వీపీ కాథీ స్కోనింగ్​ రాసుకొచ్చారు.

లేఆఫ్​కు గురైన ఉద్యోగులు కూడా.. తమ బాధను సోషల్​ మీడియాలో చెప్పుకుంటున్నారు.

Oracle Cerner job cuts : "ఒరాకిల్​ లేఆఫ్​కు గురైన వారిలో నేనూ ఉన్నాను. చాలా బాధగా ఉంది. 7 నెలల ముందు పనిలో చేరాను. నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. మేనేజర్ల నుంచి అద్భుతమైన ఫీడ్​బ్యాక్​లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. ఈ ఉద్యోగాన్ని ప్రేమించిన విధంగానే మరో ఉద్యోగం లభిస్తో బాగుంటుంది. ఈ లేఆఫ్​లతో ప్రభావితమైన వారందరికి గుడ్​ లక్​. అందరికి నా ప్రేమ," అని మివియన్​ రామోస్​ అనే మహిళ పేర్కొంది.

ఈ ఏడాది తొలినాళ్లల్లో.. కాస్ట్​ కటింగ్​ పేరుతో 3వేలకుపైగా మంది ఉద్యోగులను తొలగించింది ఒరాకిల్​ సంస్థ. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్​లను కూడా నిలిపివేసిందని వార్తలు వచ్చాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్