భారత మార్కెట్లో ఇటీవల కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. ఒప్పో తమ ప్రసిద్ధ కెమెరా-కేంద్రీకృత రెనో సిరీస్‌లో రెనో 14 ప్రో, రెనో 14 5G మోడళ్లను తీసుకొచ్చింది. మరోవైపు నథింగ్ ఫోన్ 3 కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒప్పో రెనో 14 ప్రోని నథింగ్ ఫోన్ 3తో పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఒప్పో రెనో 14 ప్రో దాని మునుపటి మోడళ్లలో చూసిన ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కొనసాగిస్తుంది. అయితే, ఇది కొన్ని మార్పులతో వస్తుంది. రేర్ కెమెరా మాడ్యూల్ మరింత వెడల్పుగా ఉండటంతో పాటు ఫ్రేమ్‌లో 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగించారు. రేర్ ప్యానెల్‌కు టెక్స్‌చర్ జోడించే "వెల్వెట్ గ్లాస్" అనే కొత్త మెటీరియల్‌ను కూడా ఇందులో వాడారు.
మరోవైపు, నథింగ్ ఫోన్ 3 ప్రత్యేకమైన డిజైన్ అంశాలపై దృష్టి పెట్టింది. ఇది గతంలో ఉన్న గ్లిఫ్ ఎల్ఈడీలను గ్లిఫ్ మ్యాట్రిక్స్తో భర్తీ చేసింది. ఇందులో 489 ఎల్ఈడీలు ఉన్నాయి. అదనంగా, ఇది గ్లిఫ్ బటన్ని కలిగి ఉంది. ఈ బటన్ యాప్ షార్ట్‌కట్‌లు, విజువల్ అలర్ట్‌లు, గేమ్‌లు వంటి కొన్ని అంతర్నిర్మిత ఇంటరాక్టివ్ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.
ఒప్పో రెనో 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.83-ఇంచ్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రెజల్యూషన్, 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ పూర్తి డీసీఐ-పీ3 కలర్ రేజ్ని కవర్ చేస్తుంది. 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది హెచ్డీఆర్10+కు మద్దతు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 3 కొద్దిగా చిన్నదైన 6.67-ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేటు 30హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు మారుతుంది. ఇది హెచ్డీఆర్10+కు కూడా మద్దతు ఇస్తుంది. అయితే 4500 నిట్స్ అధిక పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ రక్షణ కోసం అదే గొరిల్లా గ్లాస్ 7iని ఉపయోగిస్తుంది.
ఒప్పో రెనో 14 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ కనెక్ట్ చేసి ఉంటుంది. అదనంగా, ఇది ఏఐ గేమ్ హైలైట్స్, వేపర్ ఛాంబర్ టెక్నాలజీ, గ్రాఫైట్ ఉపయోగించి డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ వంటి గేమింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.
అదే సమయంలో, నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది శక్తివంతంగా అనిపించినప్పటికీ, భారతదేశంలో చాలా తక్కువ ధరకే లభించే ఇతర మిడ్-రేంజ్ ఫోన్‌లలో కూడా ఇది కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 3 12జీబీ, 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆప్షన్‌లను అందిస్తుంది, కానీ దాని అధిక ధర కారణంగా విలువపై విమర్శలు ఎదుర్కొంటుంది.
ఒప్పో రెనో 14 ప్రో 6,200ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు దాని రెనో సిరీస్‌లో అతిపెద్దది. ఇది 80వాట్ వైర్డ్ ఛార్జింగ్, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఇక నథింగ్ ఫోన్ 3 5,500ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. దీనికి 65వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు ఉన్నాయి.
ఒప్పో రెనో 14 ప్రో స్మార్ట్‌ఫోన్ నాలుగు 50MP సెన్సార్‌లతో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అందించే 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం అదనపు 50ఎంప సెన్సార్ ఉన్నాయి.
కాగా నథింగ్ ఫోన్ 3 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రధాన సెన్సార్, విశాలమైన ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు కెమెరా కూడా 50ఎంపీతో వస్తోంది.
ఒప్పో రెనో 14 ప్రో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999. కాగా, 512జీబీ మోడల్ ధర రూ. 54,999.
నథింగ్ ఫోన్ 3 12జీబీ ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుంది, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,999.
సంబంధిత కథనం