ఏప్రిల్‌లో ఫైండ్ ఎక్స్8 అల్ట్రాను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసుకుంటోంది ఒప్పో. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ ఇప్పటికే మంచి బజ్‌ను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఒప్పో ఫైండ్ సిరీస్ హెడ్ ఝౌ యిబావో ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సిస్టెమ్ స్నీక్‌పీక్‌ని అందించారు. ఇందులో 5 సెన్సార్లు ఉన్నాయి. ఒప్పోకు ఇది చాలా కొత్త విషయం! తమ గ్యాడ్జెట్స్‌లో ఫొటోగ్రఫీని మెరుగుపరిచేందుకు ఒప్పో ప్లాన్ చేస్తున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.
రాబోయే ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అధునాతన కెమెరా ఫీచర్లతో రానుంది. మరింత ఖచ్చితమైన ఇమేజింగ్, కలర్ రీప్రొడక్షన్ని అందించడానికి రూపొందించిన మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్ ఇందులో ఒకటి. మంచి స్కిన్ టోన్లతో పోర్ట్రెయిట్లను క్యాప్చర్ చేయడం ప్రాముఖ్యతను ఝౌ యిబావో నొక్కి చెప్పారు. ఈ వినూత్న హార్డ్‌వేర్ కెమెరా పనితీరును గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు. కెమెరా సెన్సర్లలో, ఈ ఫోన్ రెండు శక్తివంతమైన టెలిఫోటో లెన్స్‌ని కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ 1 / 1.56- ఇంచ్ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్ విత్ 3ఎక్స్ జూమ్, 50 మెగాపిక్సెల్ 1/2- ఇంచ్ సోనీ ఎల్వైటీ -600 సెన్సార్ మాక్రో సామర్థ్యాలతో 6ఎక్స్ జూమ్‌ని అందిస్తుంది. ఈ సెన్సార్లు వినియోగదారుల వైవిధ్యమైన ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చే వివరణాత్మక, శక్తివంతమైన చిత్రాలను అందిస్తాయని భావిస్తున్నారు.
1-ఇంచ్ సోనీ ఎల్వైటీ-900 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ చేర్పులు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా పోర్ట్రెయిట్ షాట్లు, వైడ్-యాంగిల్ ఫోటోలకు, అధిక-నాణ్యత ఫోటోగ్రఫీ కోసం ఫైండ్ సిరీస్ ఖ్యాతిని మరింత బలోపేతం చేస్తుంది.
ఫైండ్ ఎక్స్8 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.82 ఇంచ్ క్వాడ్ హెచ్డీ + అమోఎల్ఈడీ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. గేమింగ్ లేదా మీడియాను చూడటం వంటి సున్నితమైన విజువల్స్‌ని అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీతో పనిచేసే ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌ని అందించనుంది. ఇంటెన్సివ్ టాస్క్‌లు, పెద్ద మొత్తంలో డేటాను ఈ ఫోన్ హ్యాండిల్ చేయగలదని సమాచారం. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్లతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో బ్యాటరీ లైఫ్ కూడా ఆకట్టుకుంటుంది.
ఒప్పో.. ఫైండ్ ఎక్స్ 8 అల్ట్రాతో మన్నికపై కూడా దృష్టి సారించింది. వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ని కలిగి ఉంటుంది. లెదర్ వేరియంట్ కూడా సుమారు 8ఎంఎం మందంతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. అదనంగా, కస్టమ్ వైబ్రేషన్ మోటార్ హాప్టిక్ ఫీడ్ బ్యాక్‌ను మెరుగుపరుస్తుందియ మరింత ఆకర్షణీయమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది.
సంబంధిత కథనం