Oppo F29 series : ఇండియలోకి ఒప్పో ఎఫ్​29 5జీ సిరీస్​- ఇంకొన్ని రోజుల్లో లాంచ్​, ఫీచర్స్​ ఇవే!-oppo f29 india launch set for 20 march expected price specs and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo F29 Series : ఇండియలోకి ఒప్పో ఎఫ్​29 5జీ సిరీస్​- ఇంకొన్ని రోజుల్లో లాంచ్​, ఫీచర్స్​ ఇవే!

Oppo F29 series : ఇండియలోకి ఒప్పో ఎఫ్​29 5జీ సిరీస్​- ఇంకొన్ని రోజుల్లో లాంచ్​, ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

Oppo F29 series 5G : ఒప్పో ఎఫ్29, ఎఫ్29 ప్రో స్మార్ట్​ఫోన్స్​ ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఒప్పో ఎఫ్​29

ఒప్పో తన కొత్త మిడ్-రేంజ్ సిరీస్ ఒప్పో ఎఫ్29, ఒప్పో ఎఫ్ 29ప్రోలను మార్చ్​ 20న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. చైనీస్ స్మార్ట్​ఫోన్​ తయారీదారు గతంలో తన ఎఫ్ సిరీస్​తో మన్నికపై దృష్టి సారించింది. ఎఫ్29 లైనప్ ఇదే పద్ధతిలో మార్కెట్​లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఈ రెండు ఫోన్లు ఐపీ68, ఐపీ69 రేటింగ్​తో వస్తాయని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. అంటే అవి 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు పనిచేయగలవు. ఇది కాకుండా, ఒప్పో ఎఫ్29 సిరీస్​కి సంబంధించిన ఇతర వివరాలు గోప్యంగా ఉన్నాయి. కానీ లీకులు మాత్రం పలు ఎగ్జైటింగ్​ వివరాలను వెల్లడించాయి. అవేంటంటే..

ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..

ఒప్పో ఎఫ్29 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెసిటీ 7300 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది గత సంవత్సరం ఒప్పో రెనో 12ప్రో, సీఎమ్ఎఫ్ ఫోన్1, ఇటీవల లాంచ్ చేసిన వివో టి 4ఎక్స్​లో కూడ ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఎఫ్29 ప్రోలో ఓఐఎస్​తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ షూటర్​ని అందించారు.

6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో ఈ ఫోన్ రానుంది. లీక్స్​ పరంగా.. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అవి.. 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్.

ఒప్పో ఎఫ్29 5జీ స్పెసిఫికేషన్లు

ఒప్పో ఎఫ్29 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ డిస్​ప్లే ఉండనుంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్​పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఎఫ్29 ప్రో మాదిరిగానే కెమెరా సెటప్ ఉండవచ్చు. ఓఐఎస్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ లేకుండా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ఉండవచ్చు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉండవచ్చు.

45వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించవచ్చు. 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది.

ఒప్పో ఎఫ్29 5జీ సిరీస్ ధర (అంచనా)..

లీకుల ప్రకారం ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ ధర భారతదేశంలో రూ .30,000 లోపు ఉంటుంది. ఒప్పో ఎఫ్29 5జీ ధర భారతదేశంలో రూ .25,000 లోపు ఉండవచ్చు.

ఈ ఒప్పో ఎప్​29 సిరీస్​ ఇతర ఫీచర్స్​, ధరతో పాటు పూర్తి వివరాలు లాంచ్​ టైమ్​కి అందుబాటులోకి వస్తాయి. వాటి మేము మీకు అప్డేట్​ చేస్తాను.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం