Oppo F21 Pro Price Drop । కిందకు జారిన ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు.. ఆఫర్లు ఇవే!-oppo f21 pro series smartphones get price cut check offer details and fearures ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oppo F21 Pro Series Smartphones Get Price Cut, Check Offer Details And Fearures

Oppo F21 Pro Price Drop । కిందకు జారిన ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు.. ఆఫర్లు ఇవే!

HT Telugu Desk HT Telugu
Oct 16, 2022 03:53 PM IST

ఒప్పో నుంచి ఇటీవల విడుదలైన Oppo F21 Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. తగ్గిన ధరలు, ఈ ఫోన్ ఫీచర్లు చూడండి.

Oppo F21 Pro
Oppo F21 Pro (Oppo)

మీరు మధ్య-శ్రేణి ఫీచర్లతో ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకు ఈ ఆఫర్ ఉపయోగపడవచ్చు. ప్రముఖ మొబైల్ తయారీదారు Oppo భారత మార్కెట్లో Oppo F21 Pro స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. మహేష్ టెలికాం నివేదిక ప్రకారం, Oppo F21 Pro ధర రూ. 1,500 తగ్గింది. ఈ ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లాంచ్ అయింది. లాంచింగ్ సమయంలో దీని ధర, రూ. 22,999/- గా ఉండేది. ప్రస్తుతం రూ. 1500 డిస్కౌంట్ ధరతో ఇప్పుడు ఈ ఫోన్ రూ. 21,500 ధరకు అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

అలాగే ఇందులో 5G వెర్షన్ కూడా ఉంది. Oppo F21 Pro 5G ధరపై సుమారు రూ. 2,500 వరకు తగ్గింది. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 26,999/-గా ఉంది. ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 24,499/- ధరకు ఈ మోడల్ అందుబాటులో ఉంది. వీటిని ఒప్పో అధికార వెబ్‌సైట్‌ సహా ఇతర ఆన్‌లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

కొన్ని అంశాలు మినహాయిస్తే, ఈ రెండు మోడళ్లలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేరకంగా ఉంటాయి, పూర్తి వివరాలను ఇక్కడ గమనించండి.

Oppo F21 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్
  • ధర రూ. 23,499/-

Oppo F21 4G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్
  • ధర రూ. 21,500/-

ఈ స్మార్ట్‌ఫోన్‌లను రెయిన్‌బో స్పెక్ట్రమ్, కాస్మిక్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఎంపిక చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్