భారతదేశంలో నమ్మకమైన మొబైల్ బ్రాండ్లలో ఒప్పో కూడా ఒకటి. తన బడ్జెట్ ధర ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 5W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, ఐపీ65-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ రీన్‌ఫోర్స్డ్ గ్లాస్‌తో ఉంటుంది. మునుపటి వెర్షన్‌ల కంటే 160 శాతం ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
డ్యూయల్ సిమ్ కలిగిన ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15పై నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. తడి వేళ్లు, ఫాగ్, ఆయిల్ లేదా ప్రొటెక్టివ్ గ్లోవ్‌లతో కూడా టచ్ ఇంటరాక్షన్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది 4GB LPDDR4x ర్యామ్, 128జీబీ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్‌తో జత చేసి ఉంటుంది.
ఈ ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా సిస్టమ్ ఏఐ ఎరేజర్ 2.0, రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది ఇమేజ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఐదు సంవత్సరాల పాటు స్థిరమైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5జీ డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్, GLONASS, యూఎస్‌పీ టైప్-సీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MIL-STD షాక్ రెసిస్టెన్స్, ఎస్‌జీఎస్ గోల్డ్ సర్టిఫికేషన్, ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది.
భారతదేశంలో ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర 4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ధర రూ.13,999గా ఉంది. అంటే రూ.15 వేల లోపే ఈ ఫోన్ దొరుకుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్ అనే రెండు రంగులలో లభిస్తుంది. కస్టమర్లు మే 25 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్లకు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు ఉన్నాయి.