వివిధ కోడింగ్ సంబంధిత పనులపై ఏకకాలంలో పని చేయగలిగే కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్‌ని చాట్జీపీటీలో ప్రారంభించింది ఓపెన్ఏఐ. సంస్థ ప్రకారం.. ఈ కొత్త ‘కోడెక్స్’ టూల్ ఫీచర్లను రాయడం, బగ్స్‌ని పరిష్కరించడం, యూజర్ కోడ్‌బేస్ గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి టాస్క్‌లను చేస్తుంది. ప్రతి టాస్క్‌కి సొంత శాండ్బాక్స్ (ప్రైవేట్ కోడింగ్ ఎన్విరాన్మెంట్)ని ఉపయోగించుకుంది.
ఈ కోడెక్స్.. ఓపెన్ఏఐ లేటెస్ట్ రీజనింగ్ మోడల్ ఓ3పై ఆధారపడి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సంబంధిత టాస్క్‌ల కోసం ఆప్టిమైజ్ చేయడం జరిగింది. "మానవ శైలి, పీఆర్ ప్రాధాన్యతలను దగ్గరగా ప్రతిబింబించే, సూచనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండి, ఉత్తీర్ణత ఫలితాన్ని పొందే వరకు పరీక్షలను నిర్వహించగల" కోడ్‌ని సృష్టించడానికి రియల్ వరల్డ్ కోడింగ్ పనులపై ఈ నమూనాకు శిక్షణ ఇచ్చినట్లు ఓపెన్ఎఐ తెలిపింది.
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మెన్ కోడెక్స్ విడుదలను ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటిస్తూ, "ఇలాంటి సాధనాలతో ఒక వ్యక్తి ఎంత సాఫ్ట్‌వేర్‌ని సృష్టించగలడో తెలుసుకోవాలని ఆశ్చర్యకరంగా, ఉత్తేజకరంగా ఉంది," అని రాశారు.
చాట్‌జీపీటీ ప్రో, ఎంటర్ప్రైజ్, టీమ్ వినియోగదారులకు కోడెక్స్‌ను విడుదల చేసింది ఓపెన్ఏఐ. రాబోయే వారాల్లో ప్లస్, ఎడ్యు వినియోగదారులకు ఈ ఫీచర్‌ని జోడించనుంది.
కోడెక్స్ ఉపయోగించడానికి.. వినియోగదారులు చాట్‌జీపీటీలోని సైడ్బార్కు వెళ్లి ప్రాంప్ట్ టైప్ చేయడం ద్వారా, 'కోడ్' పై క్లిక్ చేయడం ద్వారా ఏఐ ఏజెంట్‌కు కొత్త కోడింగ్ పనిని కేటాయించవచ్చు. వారి కోడ్ బేస్ గురించి కోడెక్స్‌కు ప్రశ్నలు అడగడానికి, వారు టెక్ట్స్ ప్రాంప్ట్ తర్వాత 'ఆస్క్' పై క్లిక్ చేయవచ్చు.
"కోడెక్స్ ఫైళ్లను చదవగలదు, ఎడిట్ చేయగలదు, అలాగే టెస్ట్ హార్నెస్‌లు, లింటర్లు, టైప్ చెకర్లతో సహా ఆదేశాలను అమలు చేయగలదు," అని ఓపెన్ఏఐ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
కోడెక్స్ నుంచి ప్రతి పని పూర్తి కావడానికి సాధారణంగా 1 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని, దాని సంక్లిష్టతను బట్టి, యూజర్లు ఏఐ ఏజెంట్ పనితీరును రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది.
కేటాయించిన పని పూర్తయిన తరువాత, కోడెక్స్ వినియోగదారులకు టెర్మినల్ లాగ్‌లు, టెస్ట్ ఔట్‌పుట్‌ల ద్వారా దాని రిజల్ట్‌ని ధ్రువీకరించే విధంగా సైటేషన్స్ని కూడా ఇస్తుంది.
డీప్ రీసెర్చ్, ఆపరేటర్ తర్వాత ఓపెన్ఏఐ నుంచి వస్తున్న 3వ ఏఐ ఏజెంట్ ఈ కోడెక్స్. వీటిని ఓపెన్ఏఐ ఈ ఏడాదిలోనే లాంచ్ చేసింది.
సంబంధిత కథనం