ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) మాదిరిగా, ఎక్స్‌కి పోటీగా ఓపెన్ఏఐ నుంచి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేనప్పటికీ, చాట్‌జీపీటీ ఇమేజ్-జనరేషన్ టూల్స్ చుట్టూ ఇది తిరుగుతుందని, రియల్ టైమ్ కంటెంట్ షేరింగ్‌తో సోషల్ ఫీడ్‌ని కలిగి ఉంటుందని సమాచారం.
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ప్రాజెక్టుపై బయటి వ్యక్తుల నుంచి వ్యక్తిగతంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక తెలిపింది. సోషల్ నెట్వర్క్ స్టాండలోన్ యాప్‌గా ప్రారంభమవుతుందా లేదా చాట్‌జీపీటీ ప్లాట్ఫామ్లో విలీనం అవుతుందా అనేది అస్పష్టంగా ఉంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించడం వల్ల ఎలాన్ మస్క్‌తో ఆల్ట్‌మన్‌కు ఉన్న దీర్ఘకాలిక, బహిరంగ వైరం మరింత తీవ్రమవుతుంది! ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్ఏఐని కొనుగోలు చేసేందుకు మస్క్ 97.4 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని ఆల్ట్‌మన్ తిప్పికొట్టినట్టు, కావాలంటే 9.74 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ని కొనుగోలు చేస్తామని చెప్పినట్టు సమాచారం.
ఇప్పుడు ఓపెన్ఏఐ సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెడితే ఇద్దరు బిలియనీర్లు నేరుగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు అవుతుంది. ఈ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
ఏఐని ఉపయోగించుకుని క్రియేటర్లు మెరుగైన కంటెంట్‌ని క్రియేట్ చేసే విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం మెటా, ఎక్స్లానే సొంత డేటాను ఓపెన్ఏఐ ఉపయోగించుకుంటుందని సమాచారం. హ్యుమెన్ క్రియేటివిటీ, మెషిన్ ఆప్టిమైజేషన్‌తో అధిక రీచ్ కోసం ఓపెన్ ఏఐ ప్రయత్నించవచ్చు.
ఈ తీవ్ర పోటీ కృత్రిమ మేధ ఆధారిత సామాజిక ప్రదేశంలో విస్తృతమైన పోటీని సూచిస్తుంది. ఇక్కడ శక్తివంతమైన భాషా నమూనాలను రిఫైన్ చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి రియల్-టైమ్, యూజర్-జనరేటెడ్ కంటెంట్‌కి యాక్సెస్ కీలకం.
ఓపెన్ఏఐ సోషల్ మీడియా యాప్ ప్రోటోటైప్ ప్రాజెక్ట్ ఎప్పుడు పబ్లిక్‌లోకి వస్తుందనేది తెలియదు. అసలు వస్తుందా? లేదా? అనేది కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ ఇలాంటిది ఒకటి నడుస్తోందన్న వార్తలు.. కంపెనీ అగ్రెసివ్ స్ట్రాటజీని ప్రతిబింబిస్తోంది. వృద్ధి మైండ్‌సెట్‌ని కూడా సూచిస్తోంది.
ఒకవేళ ఈ సోషల్ యాప్ బయటకు వస్తే, ఓపెన్ఏఐకి ఇది తదుపరి అతిపెద్ద ప్రాడక్ట్ అవుతుంది. అండ్, అది సమాధానాలు ఇవ్వడమే కాదు కంటెంట్ క్రియేషన్- షేరింగ్‌కి ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం