OnePlus Monitors: తొలిసారి మానిటర్లను తీసుకొస్తున్న వన్‍ప్లస్.. లాంచ్ డేట్, వివరాలు ఇవే-oneplus to bring first desktop monitors in india know launch date sale and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus To Bring First Desktop Monitors In India Know Launch Date Sale And Other Details

OnePlus Monitors: తొలిసారి మానిటర్లను తీసుకొస్తున్న వన్‍ప్లస్.. లాంచ్ డేట్, వివరాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2022 08:32 AM IST

OnePlus Monitors: ఇండియాలో వన్‍ప్లస్ కంపెనీ రెండు మానిటర్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ నుంచి భారత్‍లో అడుగుపెట్టనున్నట్టు తొలి మానిటర్లు ఇవే.

OnePlus Monitors: తొలిసారి మానిటర్లను తీసుకొస్తున్న వన్‍ప్లస్.. లాంచ్ డేట్ ఇదే
OnePlus Monitors: తొలిసారి మానిటర్లను తీసుకొస్తున్న వన్‍ప్లస్.. లాంచ్ డేట్ ఇదే

OnePlus Desktop Monitors: స్మార్ట్‌ఫోన్‍లకు ఎంతో పాపులర్ అయిన వన్‍ప్లస్.. ఇక మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. కొత్తగా రెండు డెస్క్‌టాప్ మానిటర్లను తీసుకొస్తోంది. భారత్‍లో డిసెంబర్ 12న ఈ మానిటర్లను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని వన్‍ప్లస్ అధికారికంగా ప్రకటించింది. వన్‍ప్లస్ మానిటర్ ఎక్స్27 (OnePlus Monitor X27), వన్‍ప్లస్ మానిటర్ ఈ24 (OnePlus Monitor E24) పేరుతో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

లాంచ్, సేల్ వివరాలు

OnePlus Monitors: డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్27, ఈ24 మానిటర్లను లాంచ్ చేయనున్నట్టు వన్‍ప్లస్ ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే అధికారిక వెబ్‍సైట్‍లోనూ ఈ మానిటర్లను లిస్ట్ చేసింది. కొన్ని వివరాలను కూడా రివీల్ చేసింది. లాంచ్ దగ్గర పడే కొద్ది ఫీచర్లను టీజ్ చేయనుంది.

డిసెంబర్ 12న లాంచ్ తర్వాత వన్‍ప్లస్ వెబ్‍సైట్‍లోనే ఈ మానిటర్లు సేల్‍కు రానున్నాయి. ఉచితంగా మానిటర్లను గెలుచుకోండి అని వెబ్‍సైట్‍లో ఓ లక్కీడ్రాను నిర్వహిస్తోంది వన్‍ప్లస్.

OnePlus Monitors: ఇప్పటి వరకు వెల్లడైన వివరాలు

OnePlus Monitor X27, OnePlus Monitor E24లను లాంచ్ చేయనున్నట్టు వన్‍ప్లస్ చెప్పింది. వన్‍ప్లస్ ఎక్స్ 27 మానిటర్ 27 ఇంచుల డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. ఈ24 మోడల్ 24 ఇంచుల స్క్రీన్‍తో వస్తుంది. వీటిలో ఓ మోడల్ పోట్రయిడ్ మోడ్‍కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోతుందని వన్‍ప్లస్ టీజ్ చేస్తోంది. ముఖ్యంగా ఎక్స్27 మానిటర్ ప్రీమియమ్‍గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ24 మిడ్ రేంజ్‍లో అడుగుపెట్టవచ్చు.

విస్తరిస్తోన్న వన్‍ప్లస్

OnePlus Product Portfolio: వన్‍ప్లస్ క్రమంగా తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటుంది. ముందుగా స్మార్ట్ ఫోన్‍లను తెచ్చి.. చాలా పాపులర్ అయింది. క్రమంగా వేరే ఉత్పత్తులను మార్కెట్లలో తెస్తోంది. నెక్‍బ్యాంక్, టీడబ్ల్యూఎస్‍తో పాటు ఇతర ఆడియో ప్రొడక్టులను తీసుకొచ్చింది. ఇటీవలే స్మార్ట్ వాచ్‍లను లాంచ్ చేసింది. మరోవైపు స్మార్ట్ టీవీల్లోనూ వన్‍ప్లస్ జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం టాప్-3 స్మార్ట్ టీవీ బ్రాండ్లలో వన్‍ప్లస్ ఒకటిగా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు డెస్క్‌టాప్ మానిటర్ల విభాగంలోకి కూడా వన్‍ప్లస్ అడుగుపెడుతోంది.

WhatsApp channel

టాపిక్