OnePlus Pad Price: వన్‍ప్లస్ తొలి ట్యాబ్ ధర ఇదే!
OnePlus Pad Price: వన్‍ప్లస్ ప్యాడ్ ధర లీకైంది. దీంతో మిడ్ ర్ంజ్‍లోనే ఈ ప్యాడ్ రానుందని స్పష్టమైంది.
OnePlus Pad Price: వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్‍ను వన్‍ప్లస్ (OnePlus) ఫిబ్రవరిలో ప్రకటించింది. ఆ పాపులర్ కంపెనీ నుంచి ఇండియాలో అడుగు పెడుతున్న తొలి ట్యాబ్లెట్ (Tab) ఇదే. ఫిబ్రవరిలో జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్‍లో వన్‍ప్లస్ 115జీని లాంచ్ చేసిన వన్‍ప్లస్.. అదే సమయంలో వన్‍ప్లస్ ట్యాబ్‍ను పరిచయం చేసింది. అయితే వన్‍ప్లస్ ట్యాబ్ విడుదల తేదీ, ధరను అప్పట్లో వెల్లడించలేదు. ఏప్రిల్‍లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. అయితే, తాజాగా ఈ వన్‍ప్లస్ ప్యాడ్ ధర వివరాలు లీక్ అయ్యాయి. ఆ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి.
ట్రెండింగ్ వార్తలు
వన్‍ప్లస్ ప్యాడ్ ధర
OnePlus Pad Price: వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్ ప్రారంభ ధర ఇండియాలో రూ.23,099 దరిదాపుల్లో ఉంటుందని ప్రముఖ టిప్‍స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) వెల్లడించారు. ఇంట్రడక్టరీ ధర, లాంచ్ ఆఫర్లు కలిపితే ఈ ధరకు వన్‍ప్లస్ ప్యాడ్ వస్తుందని లీక్ చేశారు. ఈ ట్యాబ్లెట్ సాధారణ ధర రూ.30వేల దరిదాపుల్లో ఉంటుందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే మిడ్ రేండ్ రేంజ్‍లోనే ఈ ట్యాబ్ వస్తోందని స్పష్టమవుతోంది. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య ఈ వన్‍ప్లస్ తొలి ట్యాబ్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. లాంచ్ విషయంపై వన్‍ప్లస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వన్‍ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లు
OnePlus Pad Specifications: 11.61 ఇంచుల 2.8K ఎల్‍సీడీ డిస్‍ప్లేను వన్‍ప్లస్ ప్యాడ్ కలిగి ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ట్యాబ్‍లో టాప్ వేరియంట్ 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్‍ను కలిగి ఉంటుంది.
వన్‍ప్లస్ ట్యాబ్ వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ట్యాబ్‍కు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 9,510mAh బ్యాటరీతో ఈ వన్‍ప్లస్ ట్యాబ్ వస్తోంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‍కు ఉంటాయి.
OnePlus Pad: వన్‍ప్లస్ ప్యాడ్ లాంచ్ గురించి ఆ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ధర వివరాలను కూడా వెల్లడించొచ్చు. ఇప్పటికే అమెరికా, యూకే, యూరప్‍లో ప్రీ-ఆర్డర్లను వన్‍ప్లస్ ప్రారంభించింది. దీంతో ఇండియాలోనూ ఇదే నెలలో వన్‍ప్లస్ ప్యాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. షావోమీ ప్యాడ్, లెనోవో ట్యాబ్ పీ11 సహా మరికొన్నింటిత ఈ సెగ్మెంట్‍లో వన్‍ప్లస్ ప్యాడ్ పోటీ పడనుంది.