Foldable smartphone : ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఇది బెస్ట్​- ఇప్పుడు భారీ డిస్కౌంట్​ కూడా..-oneplus open is now available at a huge discount in india see how to grab this deal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Foldable Smartphone : ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఇది బెస్ట్​- ఇప్పుడు భారీ డిస్కౌంట్​ కూడా..

Foldable smartphone : ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఇది బెస్ట్​- ఇప్పుడు భారీ డిస్కౌంట్​ కూడా..

Sharath Chitturi HT Telugu
Dec 29, 2024 02:30 PM IST

OnePlus Open price drop : వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఫలితంగా ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 1లక్ష దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు!
వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్లు! (OnePlus)

వన్​ప్లస్​ సంస్థ నుంచి వచ్చి తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ పేరు వన్​ప్లస్​ ఓపెన్​. అక్టోబర్​ 2023లో ఈ మోడల్​ లాంచ్​ అవ్వగా, ఇప్పుడు దీనిపై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా ఈ గ్యాడ్జెట్​ని రూ. 1లక్ష కన్నా తక్కువ ధరకే దక్కించుకోవ్చచు. పూర్తి వివరాలు..

yearly horoscope entry point

వన్​ప్లస్​ ఓపెన్: డిస్కౌంట్లు, ఆఫర్..

ప్రస్తుతం వన్​ప్లస్​ ఓపెన్ అమెజాన్​లో రూ .99,999 (సుమారు $ 1,169) కు లిస్ట్​ అయ్యి ఉంది. మొదట విడుదల చేసినప్పుడు ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,39,999గా ఉండేది. ఏదేమైనా, ఈ భారీ తగ్గింపు కేవలం అమెజాన్​కే పరిమితమైంది. సంస్థ అధికారిక వెబ్​సైట్​లో ఒరిజినల్​ ప్రైజ్​ అలాగే ఉంది.

ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై డిస్కౌంట్​తో పాటు, అమెజాన్ "ట్రై అండ్ బై" ఆప్షన్​ని సైతం అందిస్తోంది. దీంతో వినియోగదారులు వన్​ప్లస్​ ఓపెన్​ని కేవలం రూ.149కే కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రయల్​తో కొనుగోలుదారులను పరికరాన్ని పరీక్షించడానికి, వారి అవసరాలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది.

వన్​ప్లస్​ నుంచి మరో ముఖ్యమైన తగ్గింపు నేపథ్యంలో ధర తగ్గింపు వచ్చింది. కంపెనీ ఫ్లాగ్షిప్ 2024 మోడల్ వన్ప్లస్ 12 కూడా ఈ వారం ప్రారంభంలో ధర తగ్గింపును చూసింది, కొనుగోలుదారులకు రూ .7,000 తగ్గింపును అందించింది.

వన్ ప్లస్ ఓపెన్ : స్పెసిఫికేషన్లు- ఫీచర్లు..

వన్​ప్లస్ ఓపెన్​లో 7.8 ఇంచ్​ మెయిన్ డిస్​ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ని సపోర్ట్ చేస్తుంది. అలాగే 6.31 ఇంచ్​ కవర్ డిస్​ప్లేని కలిగి ఉంది. స్నాప్​డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్​పై ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ఇందులో 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్​ను అందించింది సంస్థ. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 64 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్, 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ప్రధాన స్క్రీన్ పై 20 మెగాపిక్సెల్, కవర్ డిస్​ప్లేపై 32 మెగాపిక్సెల్ రెండు సెల్ఫీ కెమెరాలు కూడా ఉన్నాయి. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 4,805 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించింది.

Whats_app_banner

సంబంధిత కథనం