OnePlus Nord N20 SE: వన్‍ప్లస్ చీపెస్ట్ ఫోన్ సైలెంట్‍గా సేల్‍కు వచ్చేసింది.. కానీ!-oneplus nord n20 se lister for sale in india but there is a catch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus Nord N20 Se Lister For Sale In India But There Is A Catch

OnePlus Nord N20 SE: వన్‍ప్లస్ చీపెస్ట్ ఫోన్ సైలెంట్‍గా సేల్‍కు వచ్చేసింది.. కానీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 21, 2022 08:24 PM IST

OnePlus Nord N20 SE Sale: వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ 4జీ ఫోన్ ఇండియాలో సేల్‍కు వచ్చింది. అయితే ఈ మొబైల్‍ను తీసుకోవాలకుంటే ఈ విషయాలను తెలుసుకోండి.

OnePlus Nord N20 SE: వన్‍ప్లస్ చీపెస్ట్ ఫోన్ సైలెంట్‍గా సేల్‍కు వచ్చేసింది.. కానీ! (Photo: OnePlus)
OnePlus Nord N20 SE: వన్‍ప్లస్ చీపెస్ట్ ఫోన్ సైలెంట్‍గా సేల్‍కు వచ్చేసింది.. కానీ! (Photo: OnePlus)

OnePlus Nord N20 SE Sale: వన్‍ప్లస్ అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్‍ఈ మొబైల్ భారత్‍లో సైలెంట్‍గా సేల్‍కు వచ్చింది. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో ప్రస్తుతం ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో గ్లోబల్‍ విడుదలైన ఈ ఫోన్‍ను ఇప్పుడు ఇండియాలో లిస్ట్ అయింది. వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. అలాగే ఈ మొబైల్ వారెంటీపైనా స్పష్టత లేదు. వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

OnePlus Nord N20 SE Price: వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర, సేల్

4జీబీ + 64జీబీ స్టోరేజ్ ఉన్న వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ఫోన్ ధర ఫ్లిప్‍కార్ట్ లో రూ.14,799గా ఉంది. అమెజాన్‍లో రూ.14,588 ధరకు ఈ మొబైల్ లిస్ట్ అయింది.

అయితే, ఈ OnePlus Nord N20 SEను వన్‍ప్లస్ అధికారికంగా ఇండియాలో లాంచ్ చేయలేదు. కానీ ఈ-కామర్స్ సైట్లలోకి సేల్‍కు వచ్చేసింది. మరి ఈ ఫోన్‍కు భారత్‍లో వారెంటీ ఉంటుందో లేదో వన్‍ప్లస్ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఈ-కామర్స్ సైట్లు కూడా వారెంటీ విషయాన్ని ప్రస్తావించలేదు. మరి వన్‍ప్లస్ ఏమైనా అప్‍డేట్ ఇస్తుందేమో చూడాలి. ఈ ఫోన్‍ను కొనాలనుకునే వారు అప్పటి వరకు వేచిచూడటం బెస్ట్.

OnePlus Nord N20 SE Specifications: వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు

6.56 ఇంచుల హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేను వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్‍ సెంటర్ లో వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ డిజైన్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇది 4జీ చిప్‍సెట్. 5జీకి సపోర్ట్ చేయదు. మైక్రో ఎస్‍డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్‍లో ఉంటుంది.

వన్‍ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంది. ఈ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉండగా.. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యంతో పాటు మరిన్ని వివరాలు ఈ లిస్టింగ్స్ లో లేవు.

WhatsApp channel