OnePlus Nord CE 3 Lite 5G Offer: ఈ వన్‍ప్లస్ బడ్జెట్ ఫోన్‍ కొంటే టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉచితం: ఒక్క రోజే ఆఫర్: వివరాలివే-oneplus nord buds ce tws free on oneplus nord ce 3 lite 5g purchase one day offer ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Oneplus Nord Buds Ce Tws Free On Oneplus Nord Ce 3 Lite 5g Purchase One Day Offer

OnePlus Nord CE 3 Lite 5G Offer: ఈ వన్‍ప్లస్ బడ్జెట్ ఫోన్‍ కొంటే టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉచితం: ఒక్క రోజే ఆఫర్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2023 11:09 PM IST

OnePlus Nord CE 3 Lite 5G Offer: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేస్తే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉచితంగా దక్కించుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ ఒక్కో రోజు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని వన్‍ప్లస్ పేర్కొంది. వివరాలివే..

OnePlus Nord CE 3 Lite 5G Offer: ఈ వన్‍ప్లస్ బడ్జెట్ ఫోన్‍ కొంటే టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉచితం: ఒక్క రోజే ఆఫర్ (Photo: OnePlus)
OnePlus Nord CE 3 Lite 5G Offer: ఈ వన్‍ప్లస్ బడ్జెట్ ఫోన్‍ కొంటే టీడబ్ల్యూఎస్ బడ్స్ ఉచితం: ఒక్క రోజే ఆఫర్ (Photo: OnePlus)

OnePlus Nord CE 3 Lite 5G Offer: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది వన్‍ప్లస్ (OnePlus). ఈ మొబైల్‍ను ఫస్ట్ సేల్‍లో కొంటే రూ.2,299 విలువైన వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ (OnePlus Nord Buds CE) టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఉచితంగా పొందవచ్చని వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ ఈనెల 11వ తేదీన ఒక్క రోజు మాత్రమే ఉండనుంది. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఆఫర్లు ఇవే..

OnePlus Nord CE 3 Lite 5G Offer: వన్‍‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ సేల్ ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఆరోజు ఈ ఫోన్‍ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2,299 విలువైన వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ టీడబ్ల్యూఎస్‍ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ 11వ తేదీ ఒక్కటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందని వన్‍ప్లస్ పేర్కొంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‍ప్లస్ అఫీషియల్ వెబ్‍సైట్‍, వన్‍ప్లస్ ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1000 డిస్కౌంట్ దక్కుతుంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర వివరాలు

OnePlus Nord CE 3 Lite 5G Price Details: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉంటే టాప్ వేరియంట్ ధరను రూ.21,999గా వన్‍ప్లస్ నిర్ణయించింది. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు

OnePlus Nord CE 3 Lite 5G: స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ వస్తోంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ మొబైల్ వచ్చింది.

వన్‍ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలతో వచ్చింది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉండగా.. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం