OnePlus launch Event Live Streaming: నేడే వన్‍ప్లస్ లాంచ్ ఈవెంట్.. OnePlus 11 5G మొబైల్‍తో పాటు మరో 5 ప్రొడక్టులు-oneplus launch event today oneplus 11 5g oneplus pad and more ready for launch know live streaming timings details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Oneplus Launch Event Today Oneplus 11 5g Oneplus Pad And More Ready For Launch Know Live Streaming Timings Details

OnePlus launch Event Live Streaming: నేడే వన్‍ప్లస్ లాంచ్ ఈవెంట్.. OnePlus 11 5G మొబైల్‍తో పాటు మరో 5 ప్రొడక్టులు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 07, 2023 10:37 AM IST

OnePlus launch Event Details: వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్ (OnePlus Cloud 11) నేడు జరగనుంది. వన్‍ప్లస్ 11 5జీ (OnePlus 11 5G), వన్‍ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) మొబైళ్లతో పాటు ట్యాబ్లెట్, ఇయర్‌బడ్స్, ప్రీమియమ్ స్మార్ట్ టీవీ, కీబోర్డును వన్‍ప్లస్ లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలివే..

OnePlus launch Event Live Streaming: నేడే వన్‍ప్లస్ లాంచ్ ఈవెంట్
OnePlus launch Event Live Streaming: నేడే వన్‍ప్లస్ లాంచ్ ఈవెంట్

OnePlus Cloud 11 launch event: ప్రస్తుతం అందరి దృష్టి వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్‍ పైనే ఉంది. నేడు (ఫిబ్రవరి 7, మంగళవారం) ఈ వన్‍ప్లస్ భారీ ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఈ ఈవెంట్ లైవ్ (OnePlus Launch event live) మొదలవుతుంది. వన్‍ప్లస్ 11 5జీ (OnePlus 11 5G), వన్‍ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G), వన్‍ప్లస్ ప్యాడ్ (Oneplus Pad) ట్యాబ్, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 (OnePlus buds Pro2), వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో (OnePlus TV 65 Q2 Pro) స్మార్ట్ టీవీ, వన్‍ప్లస్ కీబోర్డు ఈ ఈవెంట్ ద్వారా ఇండియాలో లాంచ్ కానున్నాయి. ఈ లాంచ్ ఈవెంట్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు..

OnePlus launch Event Live Streaming: వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్ నేటి సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. ఈ క్లౌడ్ 11 ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్.. వన్‍ప్లస్ వెబ్‍సైట్, వన్‍ప్లస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‍లో చూడవచ్చు. 7.30 గంటల నుంచి యూజర్లు లైవ్ వీక్షించవచ్చు.

కింద ఎంబెడ్ చేసిన యూట్యూబ్ వీడియో ద్వారా కూడా లైవ్ చూడవచ్చు

OnePlus 11 5G: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2తో పాటు ప్రీమియమ్ కెమెరాలు, అదిరిపోయే 2కే డిస్‍ప్లేతో రానుంది. OISకు సపోర్ట్ చేసే హాసెల్‍బ్లాడ్ కెమెరాలు దీనికి మరో హైలైట్. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ ప్రీమియమ్ మిడ్ రేంజ్ విభాగంలో వస్తుంది.

వన్‍ప్లస్ తొలి ట్యాబ్..

OnePlus Pad: వన్‍ప్లస్ నుంచి తొలి ట్యాబ్లెట్‍గా వన్‍ప్లస్ ప్యాడ్ అడుగుపెట్టనుంది. 11.6 ఇంచుల 2కే డిస్‍ప్లేతో ఈ ట్యాబ్ రానుంది. వన్‍ప్లస్ బడ్స్ ప్రో2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ప్రీమియమ్ రేంజ్‍లో ఉంటాయి. ANCతో పాటు అధునాతన ఫీచర్లతో ఈ బడ్స్ రానున్నాయి. వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో కూడా 4కే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ సహా ప్రీమియమ్ స్పెసిఫేకషన్లు, ఫీచర్లతోనే వస్తుంది. ఇక వన్‍ప్లస్ నుంచి తొలి కీబోర్డు కూడా ఈ క్లౌడ్ 11 ఈవెంట్ ద్వారానే భారత మార్కెట్‍లో లాంచ్ కానుంది.

ఈ ప్రొడక్టుల పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను నేడు (ఫిబ్రవరి 7) జరిగే లాంచ్ ఈవెంట్‍లో వన్‍ప్లస్ వెల్లడించనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం