OnePlus Fold : వన్​ప్లస్​ ఫోల్డ్​ స్పెసిఫికేషన్స్​ ఇవే..!-oneplus folds key specifications leaked check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Fold : వన్​ప్లస్​ ఫోల్డ్​ స్పెసిఫికేషన్స్​ ఇవే..!

OnePlus Fold : వన్​ప్లస్​ ఫోల్డ్​ స్పెసిఫికేషన్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
May 20, 2023 08:10 AM IST

OnePlus Fold : వన్​ప్లస్​ నుంచి ఓ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ రాబోతోంది. ఈ గ్యాడ్జెట్​ స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి. పూర్తి వివరాలు..

వన్​ప్లస్​ ఫోల్డ్​ స్పెసిఫికేన్స్​ లీక్​..!
వన్​ప్లస్​ ఫోల్డ్​ స్పెసిఫికేన్స్​ లీక్​..! (Representative image)

OnePlus Fold features : సంస్థ నుంచి తొలి ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ను త్వరలో లాంచ్​ చేయనుంది వన్​ప్లస్​. దీని పేరు వన్​ప్లస్​ వీ ఫోల్డ్​ అని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇది లాంచ్​ అవ్వొచ్చు. తాజాగా.. ఈ ఫోల్డెబుల్​ ఫోన్​కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. వాటిని ఓసారి చూద్దాము..

వన్​ప్లస్​ ఫోల్డ్​- ఒప్పో ఫోల్డెబుల్ ఫోన్​​ను పోలి ఉంటుందా?

ఈ వన్​ప్లస్​ ఫోల్డ్ డిజైన్​​.. ఒప్పో ఫైండ్​ ఎన్​3ని పోలి ఉంటుంది ప్రముఖ టిప్​స్టర్​ యోగేశ్​ బ్రార్​ తెలిపారు. ఫోల్డింగ్​ మెకానిజం, ఫీచర్స్​ కూడా సేమ్​గా ఉంటాయని అన్నారు.

OnePlus Fold specifications leaked : ఆన్​లైన్​లో లీకైన సమాచారం ప్రకారం.. ఒప్పో టెక్నాలజీని మరోమారు వాడాలని వన్​ప్లస్​ నిర్ణయించుకుంది! ఇప్పటికే.. ఒప్పో ప్యాడ్​ 2ను వన్​ప్లస్​ ప్యాడ్​గా విక్రయిస్తోంది. అయితే.. వన్​ప్లస్​ లవర్స్​కు ఇది నచ్చకపోవచ్చు. రీబ్రాండ్​ చేసిన వస్తువులు కాకుండా.. తాము కొత్తగా ఆశిస్తున్నామను వారు చెబుతున్నారు.

వన్​ప్లస్​ ఫోల్డ్- స్పెసిఫికేషన్స్​ ఇవే..!

వన్​ప్లస్​ ఫోల్డ్​లో ఇన్వర్డ్​ ఫోల్డింగ్​ డిజైన్​, డ్యూయెల్​ డిస్​ప్లేలు, సైడ్​ మౌంటెడ్​ లేదా ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ రీడర్​లు ఉండొచ్చు. ఇందులో 8.0 ఇంచ్​ క్యూహెచ్​డీ+ ఓల్​ఈడీ ప్రైమరీ డిస్​ప్లేతో పాటు 6.5 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ స్క్రీన్​ బయట ఉండనుంది! ఒప్పో ఫైండ్​ ఎన్​3లో ఉన్న కలర్​ ఆప్షన్స్​ ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:- OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఏది బెస్ట్​?

OnePlus Fold launch date : ఇక వన్​ప్లస్​ ఫోల్డ్​లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రా వైడ్​, 32ఎంపీ స్నాపర్​ ఉండొచ్చు. ఇక సెల్ఫీల కోసం 32ఎంపీ కెమరా లభించనుంది.

మరోవైపు వన్​ప్లస్​ ఫోల్డ్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుందని రూమర్స్​ వస్తున్నాయి. 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ సైతం ఉండొచ్చు.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​పై ఇది పనిచేసే అవకాశం ఉంది. 4,800ఎంఏహెచ్​ డ్యూయెల్​ సెల్​ బ్యాటరీ, 80వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం! వయర్​లెస్​ ఛార్జింగ్​ ఉంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

వన్​ప్లస్​ ఫోల్డ్​- ధర..

OnePlus Fold price : వన్​ప్లస్​ ఫోల్డ్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్​ సమయంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. మార్కెట్​లోకి అడుగుపెట్టిన అనంతరం ఈ ఫోల్డెబుల్​ ఫోన్​.. గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​, శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​5 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం