OnePlus Discounts: వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రెడ్ రష్ డేస్ సేల్-oneplus announced red rush days sale get better discount on latest smartphones offer valid till 16th february ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Discounts: వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రెడ్ రష్ డేస్ సేల్

OnePlus Discounts: వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రెడ్ రష్ డేస్ సేల్

Anand Sai HT Telugu Published Feb 10, 2025 10:00 PM IST
Anand Sai HT Telugu
Published Feb 10, 2025 10:00 PM IST

OnePlus Red Rush Days Sale: వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ ప్రకటించింది. ఇందులో కంపెనీకి చెందిన ఫోన్లు డిస్కౌంట్‌తో చౌకగా లభిస్తాయి.

వన్‌ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్లు
వన్‌ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్లు

వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆఫర్లు, డీల్స్ లభిస్తాయి. రెడ్ రష్ డేస్ సేల్ పేరుతో ఈ సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమై ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఫోన్లపై లభించే డిస్కౌంట్లు, డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4, ఇతర స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మీ ప్రియమైన వారికి గిఫ్ట్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ గురించి ఆలోచించొచ్చు.

వన్‌ప్లస్ 13

వన్‌ప్లస్ 13 కొనుగోలుదారులు రూ. 5,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13R కొనుగోలుదారులు రెడ్ రష్ డేస్ సేల్ సమయంలో రూ. 3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఎంచుకున్న బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తాయి. వన్‌ప్లస్ 13 ఇటీవలే భారతదేశంలో రూ.69,999 ధరతో విడుదలైంది.

వన్‌ప్లస్ 12

వన్‌ప్లస్ 12 కొనాలనుకునేవారు ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై రూ.4,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తం రూ. 7000 డిస్కౌంట్ లభిస్తుంది. OnePlus 12 ప్రస్తుతం OnePlus.in లో రూ.61,999 ధరకు అమ్ముడవుతోంది. సేల్‌లో ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 4

ఈ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్‌పై రూ.1000 ప్రత్యేక డిస్కౌంట్, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లను OnePlus.in, ఆఫ్‌లైన్ పార్ట్‌నర్ స్టోర్లలో పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4

రెడ్ రష్ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE4 ధర రూ.1000 తగ్గుతుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులతో రూ.2000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

గమనిక: ఈ ఫోన్లు ఈ ప్రత్యేకమైన ఆఫర్లో భాగంగా పైన చెప్పిన ధరల్లో లభిస్తాయి. తర్వాత ధరలు తగ్గవచ్చు, పెరగవచ్చు.

Whats_app_banner