OnePlus Ace 5 : బాహుబలి బ్యాటరీ పవర్‌తో కొత్త వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ లాంచ్- ఫీచర్స్, ధర వివరాలు..
OnePlus Ace 5 pro : వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇందులో రెండు స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. అవి ఏస్ 5, ఏస్ 5 ప్రో. వీటి ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్‌లో రెండు గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవి ఏస్ 5, ఏస్ 5 ప్రో. దిగ్గజ సంస్థ వీటిని చైనాలో తాజాగా లాంచ్ చేసింది. పవర్ఫుల్ ప్రాసెసర్స్, లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీతో పాటు ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5 ప్రో- ఫీచర్స్..
వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్స్ 6.78 ఇంచ్ బీఓఈ ఎక్స్2 ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉన్నాయి. ఈ రెండు డివైజ్‌లు ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తాయి. వన్‌ప్లస్ ఏస్ 5లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, ఏస్ 5 ప్రోలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉన్నాయి. రెండు మోడళ్లు 16జీబీ ర్యామ్, 512జీబీ- 1 టీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌ని అందిస్తాయి.
ప్రో మోడల్స్‌లో ఫెంగ్చి గేమింగ్ కోర్తో కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 9925 ఎంఎం3 వీసీ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఈ వన్‌ప్లస్ ఏస్ 5- ఏస్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ కెమెరా ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ 02 బీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
వన్‌ప్లస్ ఏస్ 5లో 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ప్రో మోడల్లో 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు పరికరాలు గ్లేసియర్ బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉంటాయి. లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ని ఇది అందిస్తుంది.
వన్ ప్లస్ ఏస్ 5, ఏస్ 5 ప్రో- ధరలు..
వన్‌ప్లస్ ఏస్ 5 12 జీబీ +256 జీబీ వేరియంట్ ప్రారంభ ధరను 2,299 యువాన్లుగా(సుమారు రూ.26,900) నిర్ణయించారు. వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో బేస్ వేరియంట్ (12 జీబీ+256 జీబీ) ధరను 3,399 యువాన్లు(సుమారు రూ.39,700).
జనవరి 7 2025న ఈ వన్‌ప్లస్ ఏస్ 5, వన్‌ప్లస్ 13ఆర్గా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇండియాలో ధరల వివరాలపై ప్రస్తుతం అప్డేట్ లేదు. లాంచ్ సమయానికి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం