OnePlus Ace 2 Pro : అదిరిపోయే ఫీచర్స్​తో వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో.. ధర ఎంతంటే!-oneplus ace 2 pro launched with 24gb ram check features and price details ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Oneplus Ace 2 Pro Launched With 24gb Ram Check Features And Price Details

OnePlus Ace 2 Pro : అదిరిపోయే ఫీచర్స్​తో వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Aug 18, 2023 07:13 AM IST

OnePlus Ace 2 Pro : 24జీబీ ర్యామ్​తో వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో మోడల్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో..
వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో.. (HT Tech/ Representative image)

OnePlus Ace 2 Pro : వన్​ప్లస్​ నుంచి మరో స్మార్ట్​ఫోన్​ తాజాగా బయటకొచ్చింది. చైనాలో వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో మోడల్​ లాంచ్​ అయ్యింది. ఇది.. గతేడాది విడుదలైన ఏస్​ ప్రోకు సక్సెసర్​. ఈ గ్యాడ్జెట్​ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..!

వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ చిప్​సెట్​ దీనిసొంతం. ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ ఫీచర్స్​ వస్తున్నాయి. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత కలర్​ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది. 150వాట్​ సూపర్​వీఓఓసీ ఫాస్ట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుండం హైలైట్​.

OnePlus Ace 2 Pro in India : ఇక రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మక్రో కెమెరా సెటప్​ వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది.

యూఎస్​బీ టైప్​-సీ, ఎన్​ఎఫ్​సీ, జీఎన్​ఎస్​ఎస్​, బ్లూటూత్​ 5.3, వైఫై 7, డ్యూయెల్​ సిమ్​ వంటి కెనెక్టివిటీ ఫీచర్స్​ కూడా ఈ వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రోలో ఉన్నాయి. ఇన్​-స్క్రీన్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, డాల్బీ అట్మోస్​ డ్యూయెల్​ స్టీరియో స్పీకర్స్​, ఐఆర్​ బ్లాస్టర్​ వంటివి లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- OnePlus new launches: భారత్ లో ఒకేసారి మూడు ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసిన వన్ ప్లస్

ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రోలో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి.

12జీబీ ర్యామ్​ + 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర- 2,999 యెన్​ (సుమారు రూ. 34,100.)

16జీబీ ర్యామ్​ + 512 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర- 3,399 యెన్​ (సుమారు రూ. 38,600)

OnePlus Ace 2 Pro price in India : 24 జీబీ ర్యామ్​ + 1టీబీ వేరియంట్​ ధర - 3,999 యెన్​ (సుమారు రూ. 45,700)

సంస్థ నుంచి వస్తున్న తొలి 24 జీబీ ర్యామ్​ స్మార్ట్​ఫోన్​గా నిలిచింది ఈ వన్​ప్లస్​ ఏస్​ 2 ప్రో. గేమర్స్​ కోసమే ప్రత్యేకంగా దీనిని రూపొందించింది వన్​ప్లస్​.

కాగా.. ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​ ఎప్పుడు? ధర ఎంత ఉంటుంది? వంటి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం