వన్ ప్లస్ మొదటి కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13ఎస్ రేపు జూన్ 12 నుండి అధికారికంగా భారతదేశంలో అమ్మకానికి రానుంది. కాంపాక్ట్ డిజైన్, ప్రీమియం బిల్డ్, అధునాతన ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ ప్రాచుర్యం పొందింది. ఇది వినియోగదారులకు ఫ్లాగ్ షిప్ అనుభవాన్ని అందిస్తోంది.
వన్ ప్లస్ 13ఎస్ లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ తో జతచేయబడి, స్మూత్ పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. అందువల్ల, మీరు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే, వన్ ప్లస్ 13ఎస్ గొప్ప ఎంపిక కావచ్చు. అంతేకాకుండా మొదటి సేల్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరను మరింత తగ్గించేందుకు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. కాబట్టి వన్ప్లస్ 13ఎస్ ధర, ఆఫర్ల గురించి తెలుసుకోండి.
జూన్ 12, 2025న భారత్ లో వన్ ప్లస్ 13ఎస్ సేల్ ప్రారంభం కానుంది. పింక్ శాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. OnePlus.in, వన్ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేయవచ్చు.
వన్ ప్లస్ 13ఎస్ 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.54,999 గా నిర్ణయించారు. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.59,999. ఎస్బిఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలుదారులు రూ.5000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను పొందవచ్చు. మెయిన్ లైన్ స్టోర్లలో కన్స్యూమర్ ఫైనాన్స్ పై 15 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. వన్ ప్లస్ 13ఎస్ కోసం కొనుగోలుదారు తమ పాత డివైజ్ను రీప్లేస్ చేస్తే రూ.5000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది.
వన్ ప్లస్ 13ఎస్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్ఫామ్ ప్రాసెసర్ తో కాంపాక్ట్ బిల్డ్ లో ఫ్లాగ్షిప్ పనితీరును అందిస్తుందని వన్ ప్లస్ పేర్కొంది. చిన్న సైజులో ఉన్న వన్ ప్లస్ 13ఎస్ స్మార్ట్ ఫోన్ 8.15 ఎంఎం స్లిమ్ నెస్ ను కలిగి ఉండి కేవలం 182 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంది. ఇందులో 6.32 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్ నెస్ ఉన్నాయి. స్క్రీన్ షాట్స్, ఫ్లాష్ లైట్, కెమెరా, వాయిస్ రికార్డింగ్, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ వంటి కస్టమ్ షార్ట్ కట్ లను కూడా కొత్త ప్లస్ కీతో తీసుకువస్తుంది.
వన్ ప్లస్ 13ఎస్ డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. 5,850 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల, బ్యాటరీ లైఫ్ తో వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు.
సంబంధిత కథనం