Smartphone under 40,000 : ప్రీమియం లుక్స్​ ఉన్న బెస్ట్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ఆఫర్స్​ సూపర్​!-oneplus 13r goes on sale in india today price launch offers and more details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphone Under 40,000 : ప్రీమియం లుక్స్​ ఉన్న బెస్ట్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ఆఫర్స్​ సూపర్​!

Smartphone under 40,000 : ప్రీమియం లుక్స్​ ఉన్న బెస్ట్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ఆఫర్స్​ సూపర్​!

Sharath Chitturi HT Telugu
Jan 13, 2025 09:52 AM IST

OnePlus 13R : లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​ వన్​ప్లస్​ 13ఆర్ సేల్స్​ నేడు దేశవ్యాప్తంగా ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్​ రేంజ్​ గ్యాడ్జెట్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ 13ఆర్​ వచ్చేస్తోంది..
వన్​ప్లస్​ 13ఆర్​ వచ్చేస్తోంది..

లేటెస్ట్ ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​ వన్​ప్లస్ 13ఆర్​పై కీలక అప్డేట్​! లాంచ్ ఆఫర్లతో ఈ వన్​ప్లస్​ 13ఆర్​ సేల్స్​ నేడు ఇండియాలో ప్రారంభంకానున్నాయి. గత సంవత్సరం విడుదలైన వన్​ప్లస్ 12ఆర్​కి సక్సెసర్​గా వస్తున్నఈ ఫోన్​పై భారీ అంచనాలు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్, మెరుగైన ఐపీ రేటింగ్, పెద్ద బ్యాటరీ, ఫ్లాట్ డిస్​ప్లే సహా అనేక అప్​గ్రేడ్స్​ ఈ స్మార్ట్​ఫోన్​లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్ 13ఆర్ స్పెసిఫికేషన్లు..

వన్​ప్లస్ 13ఆర్​లో 6.78 ఇంచ్​ 120 హెర్ట్జ్ ప్రోఎక్స్​డీఆర్ అమోలెడ్ డిస్​ప్లే, ఎల్టీపీఓ 4.1 టెక్నాలజీ, 4,500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ వంటివి ఉన్నాయి. వన్​ప్లస్ నుంచి వచ్చిన ఈ కొత్త పర్ఫార్మెన్స్ ఫ్లాగ్​షిప్​.. ఫ్లాట్ డిస్​ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్​ దీనికి లభిస్తుంది.

వన్​ప్లస్ 13ఆర్​ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్​ ఉంది. వన్​ప్లస్ 12లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇందులో 12/16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ/512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి.

వన్​ప్లస్ 13ఆర్​లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ-700 ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ 2ఎక్స్ శాంసంగ్ జెఎన్5 టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 480 సెల్ఫీ షూటర్ ఉంది. రేర్ కెమెరాలు 4,60 ఎఫ్​పీఎస్ వద్ద వీడియోలను రికార్డ్ చేయగలవు. ఫ్రెంట్ సెన్సార్ 30 ఎఫ్​పీఎస్ వద్ద 1080పీ రికార్డింగ్​ చేయగలదు.

వన్​ప్లస్ 13ఆర్​ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కానీ 80 వాట్ల సూపర్​వూక్​ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ 15, వన్​ప్లస్ 13 మాదిరిగానే అప్డేట్ పాలసీతో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది.

వన్​ప్లస్ 13ఆర్ ధర..

ఈ వన్​ప్లస్​ 13 బేస్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .42,999. 16 జీబీ ర్యామ్ / 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .46,999. ఇది ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

జనవరి 13 నుంచి ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ సేల్​లోకి వస్తుంది. వన్​ప్లస్ 13ఆర్​ లాంచ్ ఆఫర్లతో వస్తోంది. 13ఆర్ రెండు వేరియంట్లకు వరుసగా రూ .39,999, రూ .46,999 కు అందుబాటులో ఉంటాయి.

OnePlus.in, వన్​ప్లస్​ స్టోర్ యాప్, అమెజాన్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, బజాజ్ ఎలక్ట్రానిక్స్​లో ఈ ఫోన్​ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం