OnePlus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్.. లీకైన వివరాలివే-oneplus 13 coming up with 100w fast charging support and more features leak details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్.. 100w ఫాస్ట్ ఛార్జింగ్.. లీకైన వివరాలివే

OnePlus 13 : త్వరలో వన్‌ప్లస్ 13 లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్.. లీకైన వివరాలివే

Anand Sai HT Telugu

OnePlus 13 : భారతదేశంలో వన్‌ప్లస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. చాలా మంది ఇష్టంగా ఈ ఫోన్‌ను తీసుకుంటున్నారు. అయితే ఈ కంపెనీ నుంచి 13 సిరీస్ త్వరలో లాంచ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

వన్‌ప్లస్ ఫోన్

మొబైల్ మార్కెట్‌లోని ప్రముఖ బ్రాండ్‌లలో వన్‌ప్లస్ ఒకటి. ఈ మొబైల్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొన్ని ఫోన్‌లు బాగా ఫేమస్ అయ్యాయి. కంపెనీ ఇటీవల వన్‌ప్లస్ 12 సిరీస్‌ను ప్రారంభించింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లానింగ్ చేస్తోంది.

వన్‌ప్లస్ కంపెనీ అక్టోబర్‌లో కొత్త వన్‌ప్లస్ 13 ఫోన్‌ను విడుదల చేయడం దాదాపు ఖాయమైంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ గురించిన కొంత సమాచారం లీక్ అయింది. మొబైల్ ప్రియులలో ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి క్యూరియాసిటీని పెంచేసింది. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ బ్యాకప్ పొందుతుందని తెలుస్తోంది.

వచ్చే నెలలో రానున్న వన్‌ప్లస్ 13 ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు చైనా 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించారు.

వన్‌ప్లస్ 13లో ఈ ఫీచర్లు ఉండే అవకాశం

వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల 2K OLED 10-బిట్ LTPO BOE X2 మైక్రో-కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో BOE X2 డిస్‌ప్లే ఉంటుందని వన్‌ప్లస్ ఇప్పటికే ధృవీకరించింది. దీనితో పాటు Qualcomm Snapdragon 8 Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌ని అందుకున్నట్లు అంచనాలు ఉన్నాయి.

వన్‌ప్లస్ 13 ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ప్రైమరీ కెమెరాకు 1/1.4 ఎపర్చర్, 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో సోనీ LYT808 సెన్సార్ లభిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ LYT600 పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్ 13 ఫోన్ 6000 mAh బ్యాటరీ బ్యాకప్‌ను పొందిందని అంటున్నారు. దీనితో పాటు ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా మరింత దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోన్ అక్టోబర్‌లో చైనాలో విడుదల కానుంది. చైనా లాంచ్ తర్వాత వన్‌ప్లస్ 13 గ్లోబల్ మార్కెట్లలోకి రానుంది. భారతదేశంలో ఈ సంవత్సరం చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.