OnePlus 12 Discount : 64 ఎంపీ కెమెరా, 12 జీబీ ర్యామ్‌తో ఉన్న వన్‌ప్లస్ 12పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇంకెందుకు ఆలస్యం
OnePlus 12 Discount : వన్‌ప్లస్ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ 12 మీద మంచి డిస్కౌంట్ నడుస్తోంది. రూ.6499 వరకు తగ్గింపుతో వస్తుంది.
వన్‌ప్లస్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 13ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే అంతకు ముందు వచ్చిన వన్‌ప్లస్ 12 ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్.. వన్‌ప్లస్ 12పై ఎటువంటి షరతు లేకుండా లాంచ్ ధర కంటే రూ .6499 చౌకగా అందిస్తుంది. అంటే మీరు 9 శాతం వరకు డిస్కౌంట్ పొందుతారు. తక్కువ ధరకే వన్‌ప్లస్ 12 కొనాలనుకునే వారికి మంచి అవకాశం ఉంది.
డిస్కౌంట్ ఆఫర్
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 12 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ .58,500కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.64,999. ఎలాంటి షరతులు లేకుండా రూ.6499 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఎలాంటి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేదు.
మంచి బ్యాటరీ
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌లో 6.82 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఎల్టీపీఓప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్షన్ విషయానికొస్తే ఈ ఫోన్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. పవర్ బ్యాకప్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 12లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
కెమెరా ఫీచర్లు
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై వన్ ప్లస్ 12 5జీ పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే వన్‌ప్లస్ 12 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
గమనిక : ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆధారంగా కథనం ఇచ్చాం.