OnePlus 12 launch : వన్‌ప్లస్ 12 వచ్చేస్తోంది.. కీలకమైన ఫీచర్స్ లీక్!
OnePlus 12 launch date : వన్‌ప్లస్ 12 ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కూడా బయటకొచ్చింది. అ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
OnePlus 12 launch date : స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో వన్‌ప్లస్ బ్రాండ్‌కు చాలా మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ నుంచి ఏ మోడల్ బయటకి వచ్చినా.. కస్టమర్లలో ఆసక్తి కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకొస్తూ ఉంటుంది సంస్థ. ఇక ఇప్పుడు ఓ వార్త బయటకొచ్చింది. వన్‌ప్లస్ 12ని సంస్థ సిద్ధం చేస్తోందని, ఈ ఏడాది డిసెంబర్లో ఈ గ్యాడ్జెట్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ మోడల్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ 12 వచ్చేస్తోంది..
పలు లీక్స్ ప్రకారం.. వన్‌ప్లస్ 12లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. వన్‌ప్లస్ 11 5జీ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉండే పంచ్ హోల్ కాకుండా.. ఈ కొత్త డివైజ్‌లో సెంటర్డ్ పంచ్ హోల్ ఉండొచ్చు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2కే రిసొల్యూషన్ లభించనుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉండొచ్చు. 5,000ఎంఏహెచ్ లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటీతో కూడిన బ్యాటరీ, 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఈ మొబైల్‌తో లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
OnePlus 12 release date : ఇక వన్‌ప్లస్ 12 రేర్‌లో సర్క్యులర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. 50ఎంపీ సోనీ ఐఎం9 సిరీస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 64ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా లెన్స్‌లు ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియలేదు. ధరకు సంబంధించిన వివరాలపైనా క్లారిటీ లేదు.
ఇదీ చూడండి:- Honor X50 : హానర్ ఎక్స్50 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే!
అయితే ఇవి రూమర్స్ మాత్రమే. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధరకు సంబంధించిన వివరాలపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోపై సంస్థ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. జులై లేదా ఆగ్టస్ట్లో ఈ గ్యాడ్జెట్.. చైనా మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ మొబైల్ లాంచ్ తర్వాత.. వనప్లస్ 12పై ఫోకస్ పెట్టాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్..
OnePlus Nord Buds 2r : నార్డ్ బడ్స్ 2ఆర్ ఇయర్‌ఫోన్స్‌ను జులై 5న ఇండియాలో లాంచ్ చేయనుంది వన్‌ప్లస్ సంస్థ. లాంచ్‌కు ముందే ఈ ఇయర్‌బడ్స్ లుక్‌ను రివీల్ చేసింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన ఫీచర్స్, ధర వంటి వివరాలు లీక్ అయ్యాయి.
పలు లీక్స్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ బాక్స్ ప్రైజ్ రూ. 2,999గా ఉంటుంది. అంటే వీటి రీటైల్ ధర రూ. 2,999 కన్నా తక్కువగానే ఉండొచ్చు. వీటిలో 12.4 ఎంఎం డ్రైవర్స్ ఉంటాయి. ఇవి ఆడియో క్వాలిటీని మెరుగుపరుస్తాయి. 3 ఈక్విలైజర్ ప్రొఫైల్స్ కూడా లభించొచ్చు. ఐపీ55 రేటింగ్‌తో కాడిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం