WhatsApp: అప్పుడు పెగాసస్ తరహాలోనే.. ఇప్పుడు హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా వాట్సాప్ లో పారగాన్ స్పైవేర్-once again high profile whatsapp users targeted by zero click spyware from paragon says report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: అప్పుడు పెగాసస్ తరహాలోనే.. ఇప్పుడు హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా వాట్సాప్ లో పారగాన్ స్పైవేర్

WhatsApp: అప్పుడు పెగాసస్ తరహాలోనే.. ఇప్పుడు హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా వాట్సాప్ లో పారగాన్ స్పైవేర్

Sudarshan V HT Telugu
Feb 04, 2025 07:09 PM IST

Paragon spyware in WhatsApp: కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెగాసస్ ఉదంతం తర్వాత, ఇప్పుడు పారగాన్ నుంచి మళ్లీ మరో స్పైవేర్ ప్రముఖ జర్నలిస్టులు, పౌరసమాజ సభ్యులు వంటి హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ లోకి వచ్చింది.

హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా స్పైవేర్
హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా స్పైవేర్ (Pixabay)

Paragon spyware in WhatsApp: కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెగాసస్ ఉదంతం తర్వాత, ఇప్పుడు మళ్లీ మరో స్పైవేర్ హై ప్రొఫైల్ యూజర్లు లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ లోకి వచ్చింది. పారగాన్ పేరుతో వచ్చిన ఈ కొత్త స్పైవేర్ వాట్సాప్ ను ఉపయోగించే పలువురు ప్రముఖ పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేయడంలో పేరొందిన ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పారాగాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు సమాచారం. తమ ప్లాట్ ఫామ్ లోని హై ప్రొఫైల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ జరిగిందని వాట్సాప్ 'ది గార్డియన్'కు వెల్లడించింది.

yearly horoscope entry point

చాలా అధునాతన స్పైవేర్

ఈ స్పైవేర్ దాడి వెనుక ఎవరు ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియదని వాట్సాప్ పేర్కొంది. ఏదేమైనా, ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసస్ మాదిరిగానే పారాగాన్ సాఫ్ట్వేర్ ను సాధారణంగా నిర్దిష్ట వ్యక్తులు లేదా సమూహాలను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఉపయోగిస్తాయని గమనించాలి. ఈ స్పైవేర్ ది జీరో-క్లిక్ దాడి అని నివేదిక హైలైట్ చేసింది. అంటే ఈ స్పైవేర్ చాలా అధునాతనమైనది. వినియోగదారులు ఏ లింక్ పై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు లేదా ఈ స్పైవేర్ లక్షిత డివైజ్ లోకి చేరడానికిి ఎటువంటి చర్య చేయవలసిన అవసరం లేదు.

వాట్సాప్ స్పందన

ఇప్పటికే పారగాన్ కు లేఖ పంపామని, ప్రస్తుతం చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. డిసెంబరులో అన్ని దాడులను నిలిపివేసినట్లు కంపెనీ పేర్కొన్నప్పటికీ, అవి ఎంతకాలం నుంచి కొనసాగుతున్నాయో అస్పష్టంగా ఉంది. జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులతో సహా అనేక మంది యూజర్లను లక్ష్యంగా చేసుకుని పారాగాన్ చేసిన స్పైవేర్ ప్రమాదాన్ని వాట్సాప్ విజయవంతంగా భగ్నం చేసింది. ‘‘ఎవరి డివైజ్ ల్లోని వాట్సాప్ ల్లో ఈ స్పైవేర్ చేరిందని మాకు సమాచారం ఉందో, ఆ వ్యక్తులను మేము నేరుగా సంప్రదించాము. తగిన చర్యలను సూచించాము’’ అని వాట్సాప్ వివరించింది. ‘‘స్పైవేర్ కంపెనీలు తమ చట్టవ్యతిరేక చర్యలకు ఎందుకు బాధ్యత వహించాలో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. వ్యక్తిగతంగా కమ్యూనికేట్ చేసే ప్రజల హక్కులను వాట్సాప్ పరిరక్షిస్తూనే ఉంటుంది' అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు 'ది గార్డియన్'కు తెలిపారు.

పారగాన్ కంపెనీ ఎవరిది?

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ స్థాపించిన పారాగాన్ ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేస్తోంది. గార్డియన్ ప్రకారం, ఈ కంపెనీకి అమెరికా లోని షాంటిలీలో మరో కార్యాలయం కూడా ఉంది. కానీ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఎఇ ఇండస్ట్రియల్ పార్ట్ నర్స్ కు ఈ కంపెనీని 900 మిలియన్ డాలర్లకు విక్రయించినట్టు సమాచారం.

Whats_app_banner