Olx lays off: ఓఎల్ఎక్స్ లో మళ్లీ లే ఆఫ్ లు షురూ; ఏకంగా కొన్ని మార్కెట్లే మూసివేత-olx group lays off 800 employees shuts down some markets ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Olx Lays Off: ఓఎల్ఎక్స్ లో మళ్లీ లే ఆఫ్ లు షురూ; ఏకంగా కొన్ని మార్కెట్లే మూసివేత

Olx lays off: ఓఎల్ఎక్స్ లో మళ్లీ లే ఆఫ్ లు షురూ; ఏకంగా కొన్ని మార్కెట్లే మూసివేత

HT Telugu Desk HT Telugu
Jun 21, 2023 12:38 PM IST

ప్రముఖ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్ (Olx Group) లో కూడా లే ఆఫ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించాలని ఓఎల్ఎక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రొసస్ (Prosus) కంపెనీలో ఒక భాగం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రముఖ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్ (Olx Group) నిర్ణయించింది. అంతేకాదు, అంతగా జనాదరణ లేని కొన్ని మార్కెట్లలో ఆటోమోటివ్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ (Olx Autos) ను మూసి వేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది.

yearly horoscope entry point

అన్ని విభాగాల్లోనూ లే ఆఫ్స్

ఓఎల్ఎక్స్ గ్రూప్ (Olx Group) లోని అన్ని విభాగాల్లో, అన్ని మార్కెట్లలో ఈ లే ఆఫ్ ప్రక్రియ ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించబోతున్న ఉద్యోగులకు ఆ విషయం ముందే తెలియజేస్తున్నామని వివరించింది. ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డామ్ లో (Amsterdam) ఉంది. ఇకపై వివిధ దేశాల్లోని సేల్స్ ఆధారంగా బిజినెస్ లో మార్పులు ఉంటాయని ఓఎల్ఎక్స్ గ్రూప్ తెలిపింది. ఇప్పటికే అర్జెంటీనా, మెక్సికో, కొలంబియా దేశాల్లో ఓఎల్ఎక్స్ గ్రూప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇతర మార్కెట్లలోనూ ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి.

గతంలో కూడా..

ఓఎల్ఎక్స్ గ్రూప్ లో లే ఆఫ్ ప్రకటన ఇదే తొలిసారి కాదు. మొత్తం ఉద్యోగుల్లో 15% ఉద్యోగులను తొలగిస్తామని ఈ జనవరి నెలలో ఈ సంస్థ ప్రకటించింది. ఆ సమయంలో దాదాపు 1500 మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. మార్చి 31, 2022 నాటకి ఓఎల్ఎక్స్ గ్రూప్ లో సుమారు 11,375 మంది ఉద్యోగులున్నారు.

Whats_app_banner