TSRTC - Olectra: 550 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్న టీఎస్ఆర్‌టీసీ: ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్-olectra greentech limited gets 550 electric buses order from tsrtc
Telugu News  /  Business  /  Olectra Greentech Limited Gets 550 Electric Buses Order From Tsrtc
TSRTC - Olectra: 550 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్న టీఎస్ఆర్‌టీసీ: ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్
TSRTC - Olectra: 550 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్న టీఎస్ఆర్‌టీసీ: ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్

TSRTC - Olectra: 550 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్న టీఎస్ఆర్‌టీసీ: ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్

06 March 2023, 17:13 ISTChatakonda Krishna Prakash
06 March 2023, 17:13 IST

TSRTC - Olectra electric buses: 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్‍టెక్ లిమిటెడ్ సంస్థకు టీఎస్ఆర్‌టీసీ ఆర్డర్ ఇచ్చింది. ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ బస్సులు ఇందులో ఉన్నాయి.

TSRTC - Olectra electric buses: ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (OGL) సంస్థకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation - TSRTC) భారీ ఆర్డర్ ఇచ్చింది. 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఓజీఎల్‍తో ఒప్పందం కుదుర్చుకుంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థే ఒలెక్ట్రా గ్రీన్‍నెట్ లిమిటెడ్ (Olectra Greentech Limited). 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్‌టీసీకి ఒలెక్ట్రా సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది అని OGL ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు.

హైదరాబాద్‍ టు విజయవాడ

Olectra electric buses: ఇంటర్‌సిటీ ఒలెక్ట్రా బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇంట్రాసిటీ బస్సులు నగర పరిధిలో తిరుగనున్నాయి. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్​సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయని ఒలెక్ట్రా గ్రీన్‍టెక్ సంస్థ (OGL) ప్రకటించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే చేస్తే 325 కిలోమీటర్ల వరకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రేంజ్ ఇస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణహితంగా ఉండడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని ఆ సంస్థ తెలిపింది.

ఆలోగా సిటీ అంతా ఎలక్ట్రిక్ బస్సులు

Olectra electric buses: 2025 మార్చి నాటికి హైదరాబాద్ నగరమంతా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువాలని సంస్థ భావిస్తోందని TSRTC ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. మొదటిదశలో 550 ఈ-బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో కొనుగోలు చేస్తున్నామని, ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

3వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు తెస్తాం

Olectra electric buses: 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నామని టీఎస్ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా టీఎస్ఆర్‌టీసీలోకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని అన్నారు.

దశలవారీగా పంపిణీ

Olectra electric buses: టీఎస్ఆర్‌టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం తమ సంస్థకు ఆర్డర్ వచ్చిందని, వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లు ఉన్న 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయని ఒలెక్ట్రా గ్రీన్‍టెక్ లిమిటెడ్ (OGL) చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ తెలిపారు. టీఎస్ఆర్‌టీసీతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ బస్సులను త్వరలో దశలవారీగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయని ఆయన ఆకాంక్షించారు.

Olectra electric buses: టీఎస్ఆర్‌టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 2019 మార్చిలోనే ప్రారంభమైందని, అప్పుడు 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్​ వచ్చిందని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్నాయన్నారు. మెరుగైన పనితీరును అందించేలా.. ఫాస్ట్ ఛార్జింగ్​తో సదుపాయంతో ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించినట్టు తెలిపారు.

ఐదు డిపోలు

Olectra electric buses: ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్‌టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించింది. దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలో డిపోలను ఏర్పాటు చేయనుందని ఒలెక్ట్రా సంస్థ వెల్లడించింది.

ఇటీవలే హైడ్రోజన్ బస్సులను కూడా ఒలెక్ట్రా సంస్థ ఆవిష్కరించింది. త్వరలోనే ఇవి రోడ్లపైకి వస్తాయని ప్రకటించింది.

సంబంధిత కథనం