FM's slip-of-tongue: ‘పొలిటికల్’ అంటూ నోరు జారిన ఆర్థిక మంత్రి-old political vehicles sorry polluting fms slip of tongue in budget speech ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  'Old Political Vehicles.. Sorry, Polluting' : Fms Slip-of - Tongue In Budget Speech

FM's slip-of-tongue: ‘పొలిటికల్’ అంటూ నోరు జారిన ఆర్థిక మంత్రి

HT Telugu Desk HT Telugu
Feb 01, 2023 02:34 PM IST

FM's slip-of-tongue: 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget) ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె నోరు జారి చేసిన వ్యాఖ్య సభలో నవ్వులు పూయించింది.

పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెడ్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెడ్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (PTI)

FM's slip-of-tongue: 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget) ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో పలు ఆసక్తి కర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పలు సందర్భాల్లో అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆనందోత్సాహాలను వ్యక్తపర్చారు.

ట్రెండింగ్ వార్తలు

FM's slip-of-tongue in Budget speech: పొలిటికల్ వెహికిల్స్

బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) పొరపాటున నోరుజారి చేసిన వ్యాఖ్యతో సభ మొత్తం ఒక్కసారిగా నవ్వుల్లో మునిగింది. కాలుష్యాన్ని పెద్ద ఎత్తున వెదజల్లుతున్న వాహనాల రీప్లేస్ మెంట్ కు సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలను వివరిస్తూ.. ‘రీప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ (replacing old polluting vehicles)’ అనడానికి బదులుగా ‘ రీప్లేసింగ్ ఓల్డ్ పొలిటికల్ వెహికిల్స్ (replacing old political vehicles)’ అని ఆర్థిక మంత్రి నోరు జారారు. వెంటనే, నవ్వుతూ, తప్పును సరిదిద్దుకున్నారు. అప్పటికే, సభ నవ్వుల్లో మునిగిపోయింది. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) నిర్మల వ్యాఖ్యలను విని గట్టిగా నవ్వేశారు. ఆ తరువాత, స్పీచ్ కొనసాగించిన ఆర్థిక మంత్రి Nirmala Sitharaman .. పొల్యూటింగ్ అనే పదం వచ్చిన దగ్గర తప్పు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు.

FM's slip-of-tongue in Budget speech: పాత వాహనాల తొలగింపు

పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని తగ్గించడం కోసం పాత వాహనాలను వాడకం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం 2021 -22 బడ్జెట్ (Budget) లోనే తీసుకువచ్చింది. ఇందుకు కొన్నిప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజాగా, ఆ పథకాన్ని కొనసాగిస్తూ, మరిన్ని నిధులను కేటాయించారు. ఈ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ (vehicle scrapping policy)లో ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు, పాత ప్రభుత్వ అంబులెన్స్ ల తొలగింపునకు సహకారం అందించనున్నట్లు Nirmala Sitharaman ప్రకటించారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

WhatsApp channel