Best electric bike : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​- దేని రేంజ్​ ఎక్కువ?-ola roadster x vs revolt rv1 which electric bike should be your pick ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Bike : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​- దేని రేంజ్​ ఎక్కువ?

Best electric bike : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​- దేని రేంజ్​ ఎక్కువ?

Sharath Chitturi HT Telugu
Updated Feb 08, 2025 11:12 AM IST

ఓల రోడ్​స్టర్​ ఎక్స్​ వర్సెస్​ రివోల్ట్​ ఆర్​వీ1.. ఈ రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​లో ఏది బెస్ట్​? దేని రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓల రోడ్​స్టర్​ ఎక్స్​ వర్సెస్​ రివోల్ట్​ ఆర్​వీ1
ఓల రోడ్​స్టర్​ ఎక్స్​ వర్సెస్​ రివోల్ట్​ ఆర్​వీ1

భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్​స్టర్​ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్​ని ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ ఎట్టకేలకు లాంచ్​ చేసింది. ఇది ఈవీ తయారీదారు నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్​గా గుర్తింపు తెచ్చుకుంది. మూడు విభిన్న వేరియంట్లలో లభించే ఈ ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​పై కస్టమర్లలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న రివోల్ట్​ ఆర్​వీ1తో ఈ ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ని పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ వర్సెస్ రివోల్ట్ ఆర్​వీ1: ధర..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ ప్రారంభ ధర రూ .75,000 - రూ .95,000 (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 11 తర్వాత రూ .90,000 - రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు పెరుగుతుంది. ఓలా రోడ్​స్టర్ ఎక్స్ మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. అవి.. 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్. 4.5 కిలోవాట్​.

బేస్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ .75,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రారంభ ఆఫర్ ముగిసిన తర్వాత అది రూ .90,000 (ఎక్స్-షోరూమ్) అవుతుంది. మిడ్ వేరియంట్ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుంది. దీని ధర రూ .85,000 (ఎక్స్-షోరూమ్). ఫిబ్రవరి 11 తర్వాత దీని ధర రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్)కు పెరుగుతుంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుంది. దీని ధర రూ .95,000 (ఎక్స్-షోరూమ్). ఫిబ్రవరి 11 తర్వాత ఈ ఎలక్ట్రిక్​ బైక్​ ధర రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవుతుంది.

మరోవైపు, రివోల్ట్ ఆర్​వీ 1 ధర రూ .85,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ వర్సెస్ రివోల్ట్ ఆర్​వీ1: స్పెసిఫికేషన్..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్​లో 7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బైక్​ బేస్ వేరియంట్ గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని పొందుతుంది. ఇందులోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. మిడ్ వేరియంట్ గరిష్టంగా గంటకు 117 కిలోమీటర్ల వేగంతో, టాప్ ఎండ్ వేరియంట్ గరిష్టంగా గంటకు 124 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రెండు వేరియంట్లు ఫుల్​ఛార్జ్ చేస్తే వరుసగా 159 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తాయి. రివోల్ట్ ఆర్​వీ1ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. అయితే దీని టాప్​ స్పీడ్​ 70 కేఎంపీహెచ్​.

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్​లో ఎలక్ట్రిక్ స్కూటర్లదే ఆధిపత్యం! అయితే ఇటీవలి కాలంలో ఈ-బైక్స్​ కూడా వస్తున్నాయి. అనేక ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ స్టైలిష్​గానే ఉంది, లాంగ్​ రేంజ్​ని ప్రామిస్ చేస్తోంది. కానీ​ రివోల్ట్ మోటార్స్ ఈ సెగ్మెంట్​లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ డొమైనలో ఎర్లీ ఎంట్రీగా నిలిచింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఓలా రోడ్​స్టర్ ఎక్స్​కు గట్టి పోటీదారుగా రివోల్ట్ ఆర్​వీ1 అనడంలో సందేహం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం